రాజారెడ్డి రాజ్యాంగంలో కొత్త కొత్త సెక్షన్లు చేర్చి వెంటనే ప్రెస్మీట్లు పెట్టి అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి.. అందరూ జాగ్రత్తగా ఉండాని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. ఈ బాధ్యతను స్వయంగా చీఫ్ సంజయ్ తీసుకుంటున్నారు. ఆయన పెట్టిన తప్పుడు కేసులు గురించి దేశమంతా కథలు కథలుగా చెప్పుకుంటూంటే… తల ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించకుండా కొత్తగా రాజారెడ్డి రాజ్యాంగంలో ఏంచేర్చాలో చెప్పడానికి గర్వంగాప్రెస్ మీట్లు పెడుతున్నారు. కొత్తగా ఆయన ప్రెస్ మట్ పెట్ి.. సోషల్ మీడియా పోస్టులు పెడితే ఆస్తులు ఎటాచ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసేశారు. అసలు సోషల్ మీడియా పోస్టులకు అరెస్టులు వద్దని సుప్రీంకోర్టు చెబుతూంటే.. ఈయన మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు.
సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్లు చెప్పి మరీ హెచ్చరికలు జారీ చేశారు. గుర్తిస్తే.. రాత్రికి రాత్రి పోయి తలుపులు బద్దలు కొట్టి ఏదో ఓ కేసు పెట్టి అరెస్టు చేస్తారుగా.. ఎందుకు చేయలేదో మాత్రం చెప్పలేదు. 202 సోషల్ మీడియా అకౌంట్స్‌ను మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని.. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2,972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేసినట్లు సీఐడీ చీఫ్ సంజయ్ బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే మరి వైసీపీ వాళ్ల పోస్టుల సంగతేమిటంటే.. దానికి మాత్రం నీళ్లు నమిలారు. ఆ పోస్టులు తీసేస్తున్నామన్నారు.
సోషల్ మీడియాలో అత్యంత ఘోరమైన , సభ్యత సంస్కారం లేని బ్యాచ్ అంతా వైసీపీ సోషల్ మీడియానే. వారు మాత్రం ఇతరుల కుటుంబాల్ని ఎన్ని విధాలుగా అయినా కించపర్చవచ్చు కానీ.. జగన్ రెడ్డి ఫ్యామిలీని ఎవరూ ఏమీ అనకూడదు. వైసీపీని అనకూడదు. ఇలాంటి పక్షపాత వైఖరి వల్లనే ఏపీలో పోలీసులు..సీఐడీ అంటే.. ప్రజలకు లోకు వ అయిపోయింది. అయినా వీరంతా తుడిచేసుకుని వెళ్లిపోతున్నారు కానీ.. తమ తీరును మార్చుకునేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు.