ఏపీ ప్రభుత్వం కనీస ఆధారాలు లేకండా కక్ష సాధింపు ధరోణితో తనపై నమోదు చేస్తున్న కేసుల విషయంలో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ పూర్తయి రెండు వారాలు దాటిపోయింది. తొమ్మిదో తేదీ లోపు తీర్పు ఇస్తామని ధర్మానసం ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా జరిగిన వాదనల్లో 9వ తేదీ లోపు తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. తొమ్మిదో తేదీన విచారణలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు లిస్ట్ అయింది.
కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు మాత్రం ఇంకా లిస్ట్ కాలేదు. క్వాష్ పిటిషన్ పై తీర్పు తో.. బెయిల్ పిటిషన్ అంశం కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని గత విచారణల సందర్భంగా సుప్రీంధర్మాసనం చెప్పింది. పైగా రెండు కేసుల న్యాయవాది ఒకరే. గురువారం ఉదయం సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.
అలాగే.. ఈ కేసులు విచారణ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబుపై దాఖలైన మద్యం, ఇసుక కేసుల గురించీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. క్వాష్ పిటిషన్పై తీర్పు వెంటనే ప్రకటిస్తారా లేకపోతే మరేదైనా తేదీని ప్రకటిస్తారా అన్నది అప్పుడే ధర్మాసనం వెల్లడించే అవకాశం ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాతనే ఫైబర్ నెట్ కేసు పై విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.