కొడంగల్ నియోజకవర్గం హాట్ టాఫిక్‌గా మారింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి రెండు సార్లు గెలిచి ఓ సారి ఓడిపోయారు. గత ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. ఆయనను గెలిపించేందుకు ఎక్కువ దృష్టి పెట్టి తాను ఓడిపోయారు పట్నం మహేందర్ రెడ్డి. దీంతో ఆయన రాజకీయ జీవితానికి మసక పడింది. చివరికి ఆయనకు మూడు నెలల ముందుగా మంత్రి పదవి ఇచ్చి సర్దుబాటు చేశారు. కానీ ఆయన తీరు మాత్రం కాస్త సందేహాస్పదంగానే ఉంది.
కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అభ్యర్థి అనే ప్రచారం ఉంది కాబట్టి… రేవంత్ రెడ్డిపై ఈ సారి గతంలోలా దూకుడుగా వెళ్లాలని ఆయన అనుకోవడం లేదు. అందుకే గతంలోలా ప్రయత్నాలు చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి కొడంగల్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆయన నామినేషన్ కోసం ప్రతి ఊరి నుంచి జనం తరలి వచ్చారు. అయితే రేవంత్ ను ఓడించడానికి తెలంగాణ భవన్ లో ప్రత్యేక వార్ రూమ్ ను బీఆర్ఎస్ హైకమాండ్ ను పెట్టింది. అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎప్పుడు ఏం చేయాలో అక్కడ్నుంచే దిశానిర్దేశం చేస్తున్నారు. సొంత రాజకీయం వద్దని చెప్పినట్లు చేయాలని సూచనలు వెళ్లాయి.
గత ఎన్ని కల్లో గెలవడానికి ఎన్నో చెప్పిన నరేందర్ రెడ్డి, కేటీఆర్ ఐదేళ్లలో అసలు పట్టించుకోకపోవడం… రేవంత్ కు కలసి వస్తోదంి. అదే సమయంలో సీనియర్ నాయకులు గురునాథ్‌రెడ్డి హస్తం గూటికి చేరడంతో కొడంగల్‌లో కాంగ్రెస్‌కు మరింత బలం ఇచ్చింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం ఆయన పని చేశ ారు. గురునాథ్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటముల్లో గురునాథ్‌రెడ్డి కీలకం కానున్నారు. దాంతో విజయంపై కాంగ్రెస్ ధీమాగా ఉంది.