తనపై నమోదు చేసిన తప్పుడు కేసుల విషయంలో చంద్రబాబు చేస్తున్న న్యాయపోరాటం సాగుతూనే ఉంది. తనకు 17ఏ వర్తిస్తుందంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ చాలా కాలం కిందటే పూర్తయింది. ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 9వ తేదీలోపు ఇస్తామని ధర్మాసనం చెప్పింది. కానీ ఇప్పుడు దీపావళి సెలవుల తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముంద్తు బెయిల్ పిటిషన్ పై విచారణను 30వ తేదీకి వాయిదా వేశారు.
అప్పటి వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయబోమని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. 17ఏ పై తీర్పు వస్తే.. చంద్రబాబు తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం చంద్రబాబుపై పిచ్చి పట్టినట్లుగా కేసులు పెడుతోంది. సీబీఐ తనపై ఎన్ని కేసులు పెట్టిందో.. చంద్రబాబుపై అన్ని కేసులు పెట్టాని జగన్ రెడ్డి అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏ మాత్రం ఆధారాలులేకుండా.. కేబినెట్ నిర్ణయాలపై.. అదీ కూడా తమపై ఏ అంశంపై అవినతి ఆరోపణలు చేస్తున్నారో వాటిపైనే కేసులు పెడుతూ వస్తున్నారు.
ఎన్ని విమర్శలు వస్తున్నా తగ్గడం లేదు. ఇలాంటి కేసులు కోర్టుల్లో నిలవకపోయినా.. చట్టం చేతుల్లో ఉన్న కారణంగా తీసుకుని కొన్ని రోజులు చంద్రబాబును జైల్లో పె్టటడం.. చంద్రబాబు ఎన్నికల సన్నాహాలను దెబ్బతీయడం వంటి కుట్ర పూరిత ఆలోచనలతోనే ఈ కేసులు పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 17ఏసెక్షన్ వర్తింపుపై తీర్పు తర్వాత అసలు విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.