జగన్ రెడ్డి గెలుపు కోసం పని చేసినందుకు ఆంధ్రతో పాటు బయట నుంచి తనకు తిట్లు వస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ వాపోయిన వీడియో ఇటీవల వైరల్ అయింది., అంతకు ముందు ప్రభుత్వాల పనికి మాలిన విధానాలు, రాష్ట్రాలను దివాలా తీసే పథకాల గురించి మాట్లాడుతూ ఏపీని ఉదాహరణగా చూపించారు. మొత్తం పంచి పెడుతూ పోతే ఏపీలా అయిపోతుందని చెప్పారు. ఇదే తరహాలో పీకే వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. జగన్ రెడ్డి పాలనా తీరుపై ఘోరమైన అభిప్రాయాన్ని బయట కూడా కలిగిస్తున్నాయి. నిజాగనికి పీకే కంపెనీ ఐ ప్యాక్ ఇప్పటికీ జగన్ రెడ్డి కోసం పని చేస్తోంది. అయినా ఎందుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదిగో ఆయన ప్రశాంత్ కిషోర్.. మనల్ని గెలిపిస్తున్నారు అని ఎన్నికలకు ముందు పార్టీ క్యాడర్ కు పరిచయడం చేశారు జగన్ రెడ్డి. గెలిచిన తర్వాత కూడా ఆయనే గెలిపించారని చాలా గౌరవం ఇచ్చారు. ఆయన అడగాలే కానీ.. ఎంత కావాలంటే అంత ఇచ్చి మళ్లీ స్ట్రాటజిస్ట్ గా పెట్టుకుంటారు. కానీ ఆయన దూరంగా ఉండి.. ఆయన కంపెనీతో మాత్రం పనులు చేయించుకుంటున్నారు. అందు కోసం ఇస్తున్న మొత్తం చాలా పెద్ద మొత్తమే. ఇంకా చెప్పాలంటే.. పీకే బీహార్ లో పాదయాత్ర చేయడానికి కూడా జగన్ రెడ్డి ఆర్థిక సాయం చేశారని చెబుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు పీకే హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించి జగన్ రెడ్డికి మైనస్ అయ్యేలా ప్రకటనలు చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్ పనితీరు విషయంలో జగన్ రెడ్డి పూర్తి అసంతృప్తిగా ఉన్నారని ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పీకే.., జగన్ రెడ్డికి హెచ్చరికలు పంపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఐ ప్యాక్ కు ఏపీ తప్ప మరో రాష్ట్రం లేదు. కేసీఆర్ కూడా తన ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. సోషల్ మీడియా స్ట్రాటజీలు మాత్రమే ఐ ప్యాక్ ఇస్తోంది. ఏపీలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ఫలితం తేడా వస్తే ఐ ప్యాక్ ను హైర్ చేసుకునేందుకు మరో పార్టీ ముందుకు రాదు. ఇప్పుడంతా సునీల్ కనుగోలు హవా నడుస్తోంది. ఈ పరిణామాలు అన్నింటినీ ఊహించే పీకే… జగన్ రెడ్డిని .. లైట్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భావిస్తున్నారు.