తెలంగాణ కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి, బడా కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం సంచలనంగా మారింది. రెండు రోజుల పాటు కనీసం ముప్ఫై చోట్ల ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయినప్పటకీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు కావడంతో.. ఆయన సోదాల్లో ఏం దొరికాయో.. టీవీ9 వంటి చానళ్లు చెప్పడానికి సందేహిస్తున్నయి. అదే రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేసి ఉంటే ప్రచారం వేరేలా ఉండేది.
గత ఎన్నికలకు ముందు రేవంత్ ను ఇంట్లో పెట్టి.. మూడు రోజుల పాటు టీవీ9, ఎన్టీవీ చేసిన ప్రచారాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు పొంగులేటి విషయంలో మాత్రం ఆ కూలి మీడియాలు రెండు తమ బాధ్యత పక్కాగా నిర్వర్తించాయి. ఒక వేళ పొంగులేటి ఇంట్లో.. ఏమైనా దొరికితే.. అక్కడ తీగ లాగితే.. కదిలేది తాడేపల్లి డొంక అనేది చాలా మందికి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే.. పొంగలేటికి డబ్బులు అన్నీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న బిల్లుల ద్వారానే ఉంటున్నాయి. చివరికి గనుల సీవరేజీ వసూలు చేసుకునే కాంట్రాక్ట్ కూడా.. పొంగులేటి కంపెనీకి దక్కింది. ఇటీవలి కాలంలో ఎన్నికల కోసం ముందస్తుగా అస్మదీయ కంపెనీలకు వేల కోట్ల బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఈ క్రమంలోనే పొంగులేటి ఇంటిపై జరిగిన దాడుల్లో అవకతవకలు . నగదు ఏమైనా దొరికినా.. వాటి గురించి ఆరా తీస్తే మొదటగా .. తాడేపల్లి దగ్గరకే చేరుతుంది. అందుకే ఈ అంశంపై చాలా మంది గుంభనంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి దాడుల్ని ఎలా కవర్ చేయాలో తమకు తెలుసని.. ఏపీ పెద్దలు ధీమాగా ఉన్నారు.