తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తు సమస్య వచ్చిపడింది. జనసేనకు గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులకు కామన్ సింబల్ కేటాయించరన్న ప్రచారం జరిగింది. కానీ జనేసన విజ్ఞప్తితో జనసేన పార్టీ బీఫాంపై పోటీ చేస్తున్న అందరికీ కామన్ సింబల్ గాజు గ్లాస్ కేటాయిస్తారు. అయితే ఇంతటితో సమస్య పరిష్కారం కాలేదు. అసలు సమస్య ఇక్కడే ప్రారంభమవుతోంది. జనసేన బీఫాం ఉన్న చోట్ల గాజు గ్లాస్ ఇస్తారు. లేని చోట ఆ గుర్తు ఇండిపెండెంట్లకు ఇస్తారు. అదే అసలు సమస్య. జనసేన.. ఏపీలో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. తెలంగాణలో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లభించలేదు.
దీంతో ఆ పార్టీ గుర్తు గాజుగ్లాస్ ను తెలంగాణలో రిజర్వ్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రాకరం జనసేన బీఫాంపై పోీట చేసే చోట్ల అందరికీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. కానీ జనసేన పార్టీ పోటీ చేయని చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశం ఉంది. ఇది కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుంది. జనసేన ఓటర్లు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బీజేపీకి నష్టం జరుగుుతందన్న ఆందోళన ఉంది. అదే గుర్తింపు పొందిన పార్టీ అయితే.. పోటీ చేయకపోతే .. ఆ సింబల్ ఎవరికీ కేటాయించరు.
కానీ జనసేన విజ్ఞప్తి మేరకు కామన్ సింబల్ కేటాయిస్తున్నారు కానీ..పోటీ చేయని చోట ఇతర నియోజకవర్గాల్లో ఇతరులకు కేటాయించవద్దని కోరే అవకాశం లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన జనసేన.. పోటీ చేయలేదు. కానీ ఆ ఎన్నికల్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తనకు గాజు గ్లాస్ గుర్తు కావాలని ఈసీని కోరడంతో ఆ గుర్తును కేటాయించారు. దీంతో ఆ గుర్తుకూ కొన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.