ఏపీ రాజధాని అమరావతేనని మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో ఓ ఎంపీ రాష్ట్రాల రాజధానులపై అడిగిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని స్పష్టం చేసింది. నిజానికి ఏపీ రాజధాని అమరావతే. అందులే ఎలాంటి డౌట్స్ లేవు. కేంద్రం నోటిఫై చేసింది. కానీ తాము మూడు రాజధానులు పెడతామని.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని.. అదొక్కటే రాజధాని అని.. వైసీపీ ప్రచారం చేస్తోంది. కానీ చట్ట పరంగా సాధ్యం కాదని తేలడంతో దొడ్డిదారి మార్గాలను ఎంచుకుంటోంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష కోసం అంటూ అక్కడ ఐదు వందల కోట్లతో క్యాంప్ ఆఫీసు కట్టుకుని అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కోర్టు కేసుల కారణంగా ఆలస్యమవుతోంది. ఆయన రాజధాని కారణంగానే వెళ్తున్నారని బయట ప్రచారం చేస్తున్నారు కానీ.. వర్క్ రీలోకేషన్ అని కూడా అధికారికంగా చెప్పే ధైర్యం లేకుండా పోయింది. అదీ కూడా వెళ్లలేకపోతున్నారు. గతంలో కేంద్రం కొంత సంశయంగా అమరావతి రాజధాని అని చెప్పడానికి ప్రయత్నించేది. కానీ ఇప్పుడు మాత్రం నేరుగానే సమాధానం ఇస్తోంది.
రాజధానిగా అమరావతిని మార్చడం అేది న్యాయపరంగా సాధ్యం కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయినా జగన్ రెడ్డి ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖకు వెళ్లి ఏదో చేస్తున్నానని ప్రజలు అనుకోవాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే విశాఖ ప్రజల్లోనూ జగన్ విశాఖ రాకపోతే బాగుండన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.