దొంగ ఓట్లు ఉంటే తీసేయమని అడగుతారు. డబుల్ ఓట్లు ఉంటే తీసేయమని అడుగుతారు. తప్పుడు పేర్లుఉంటే తీసేయమని అడుగుతారు కానీ.. వైసీపీ నేతలు మాత్రం… ఒక కులం ఓట్లు తీసేయాలని ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వైసీపీ నేతల బృందం ఇదే కోరింది. హైదరాబాద్లో ఉంటున్న ఏపీ ఓటర్లకు డబుల్ ఎంట్రీలు ఉన్నాయని హైదరాబాద్లో ఓటు వేసిన వారు మళ్లీ ఏపీలో కూడా ఓట్ల హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని మంత్రులు చెబుతున్నారు.
అయితే ఇలా ఫిర్యాదు చేస్తే బాగానే ఉండేది. కానీ డబుల్ ఎంట్రీలు ఉన్న ఒక్క సామాజికవర్గం ఓట్లనే తొలగించాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీకి చెందిన లక్షా 30 వేల మందికి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయని, వారికి రాష్ట్రంలో కూడా ఓట్లు ఉన్నాయని … మరీ ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయని, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయని వాటిని తొలగించాలని కోరారు. తెలంగాణలో ఓటేసిన వారిని ఏపీలో ఓటేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేదే తమ విధానమని చెప్పారు. అంటే.. తమ వారికి డబుల్ ఓట్లు ఉంటే పర్వాలేదు కానీ.. తమకు మద్దతివ్వరు అనుకున్న వారి ఓట్లు మాత్రం తీసేయాలని..అదీ నేరుగా సామాజికవర్గం పేరు పెట్టి అడగడం ఎవరినైనా అవాక్కయ్యేలా చేస్తుందేమో కానీ.. ఏపీ ప్రజల్ని .. వైసీపీ నేతల్ని కాదు.
ఎందుకంటే … ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచి డీఎస్పీల వ్యవహారం దగ్గర్నుంచి అన్నీ తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకున్న వారే. ఏపీలో ఉపఎన్నికల్లోనే బస్సులను పెట్టి ఓటర్లను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకున్న పార్టీ నేతలే.. ఇప్పుడు ఇలా ఫిర్యాదు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.