ఒక్క సారి చాన్స్ వస్తే పార్టీని ఎలా విస్తరించాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకు ఆయన పదవి బాధ్యతలు చేపట్టక ముందే గ్రామాలపై దృష్టి పెట్టారు. వచ్చే ఫిబ్రవరితో పంచాయతీల కాల పరిమితి ముగిసిపోతుంది. అంతకు ముందే ఎన్నికలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పంచాయతీల్లో పట్టు సాధించడం గొప్ప విజయానికి బాటలు వేస్తుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్ల 80 శాతం ఆ పార్టీనే గెల్చుకుంది. ఈ సారి చాయిస్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది.
తెలంగాణ పల్లెల్లో ఈ సారి కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఎన్నికల విజయం వేడి ఉండగానే పంచాయతీల్లో జెండా పాతేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తరవాత మున్సిపల్ ఎన్నికల గురించి ఆలోచించవచ్చు. పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించడానికి గ్రామ స్థాయి నేతలకు పదవులు వచ్చేలా చేయడానికి సర్పంచ్ ఎన్నికలు బాగా ఉపయోగపడతాయి. పదేళ్లుగా పవర్ లేని క్యాడర్ కు జోష్ ఇస్తాయి.
రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికలు ఎలా గెలిపించాలో గతంలో కేసీఆరే చూపించారు. ఆ ప్లాన్ ను తనదైన శైలిలో ప్రయోగిస్తే బీఆర్ఎస్ కు మరిన్ని కష్టాలు వస్తాయి. గ్రామాల్లోనూ పదవులు క్యాడర్ కోల్పోతే… వారిని పార్టీలో ఉంచుకోవడం కష్టం అవుతుంది. ఈ విషయం రేవంత్ కు కూడా తెలుసు కాబట్టి.. తన పంజా విసిరే అవకాశం ఉంది.