తెలంగాణలో శనివారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతోంది. మహాలక్ష్మి స్కీమ్ ను అమలు ప్రారంభిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణమే. తెలంగాణ దాటి బయటకు వెళ్లాలనుకునేవారు కూడా ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవచ్చు.
కానీ బోర్డర్ వరకే ఉచితంగా బోర్డర్ దాటితే చార్జీలు వసూలు చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సులను ఉచిత కేటగరిలో చేర్చకపోవడంతో డబ్బులు కట్టి వెళ్లాలనుకునే వారు ఆ బస్సుల్లో ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు మామూలుగా తక్కువగా ఉంటాయి. అవి కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. వాటిని పెంచాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఇప్పటికే ఈ స్కీమ్ అమల్లో ఉంది. ప్రభుత్వానికి రోజుకు దాదాపుగా నాలుగైదు కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది.
రోజూ ఆఫీసులకు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలకు, స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు.. ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. కొంత ఖర్చు మిగులుతుంది. ఈ పథకం కోసం మహిళలు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే కిక్కిసిరిపోయేలా కాకుండా.. సర్వీసుల్ని.. బస్సుల్ని కాస్త ఎక్కువగా ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోకుండా ఉంటుంది.