ప్రతిపక్ష నేతగా జగన్ రెడ్డి ఉన్నప్పుడు వరదలు వస్తే… మోకాళ్ల లోతులో బురదలో నిలబడి… తన సెక్యూరిటీని వంగోబెట్టి.. ఆయనపై చేయి పెట్టి… వీరావేశంతో ఎకరానికి పాతిక వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఆయన ఆవేశం చూసి బాధిత రైతులు చంద్రబాబు ప్రభుత్వం పదివేలు ఇచ్చినా… జగన్ రెడ్డి వస్తే పాతిక వేలు ఇస్తారని అనుకునేవారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతోంది. మరి నిజంగా చేశారు ?
బాపట్ల జిల్లాలో జగన్ రెడ్డి వరద ప్రాంతాలనుపరిశీలించారు. ఎలా… భారీగా మునిగిపోయిన పొలాల దగ్గర సీఎం జగన్ రెడ్డి కోసంఓ వ్యూపాయింట్ ఏర్పాటు చేశారు.అది కూడా చక్కగా స్టేజ్ కట్టి…తెల్లటి పరదాలతో అలకరిస్తే.. ఆయన స్టైల్ గా నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చి… ఫేస్ అదోలా పెట్టి..తన రెండు చేతుల్ని ఒకదానితో ఒకటి నలుపుకూంటూ చూసి… తర్వాత .. వైసీపీ నేతలను రైతులుగా కూర్చోబెట్టిన సభలో మాట్లాడటానికి వెళ్లారు. పొలంలోకి దిగలేదు. రైతుల్ని పరామర్శించలేదు. చిత్తూరు జిల్లాలోనూ అదే జరిగింది. దీన్ని కూడా పరామర్శ .. వరద బాధితప్రాంతాల పరిశీలన అంటారా అని అందరూ ఆశ్చర్యపోయారు. అంతగా బురద అంటుకుంటుందనుకుంటే రావడం ఎందుకన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బురదలోకి దిగి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా అధికారం వచ్చాక అంత టెక్కు ఎందుకని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
సరే ఆయన పరామర్శ స్టైలిష్ గా చొక్కా నలగకుండా.. మట్టి అంటకుండా ఉంటే ఉండింది కానీ.. మరి పరిహరం అయినా ఇచ్చారా అంటే… ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పుకుని పోయారు. ఎకరానికి పాతిక వేల పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షనేతగా డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పరిహారం ప్రకటించలేదు. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే.. పైసా పరిహారం ఇవ్వకుండా ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని… ఆదుకుంటామని చెప్పి చక్కా పోయారు. ఆయన తీరు చూసి రైతులకు నీరసం వచ్చింది.ఒక్క రూపాయి సాయం రాదని తేలిసి.. ఆయన బాపట్ల జిల్లా నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు.