తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖను సీనియర్ మంత్రులకు ఇవ్వకుండా తనే అట్టి పెట్టుకోవడంతో ఆయన హైకమాండ్ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో పొందినట్లేనని భావిస్తున్నారు. సాధారణంగా డిప్యూటీ సీఎం హోదా ఉన్న వారికి హోంశాఖ ఇస్తారు., మల్లు భట్టి విక్రమార్క ఈ పదవిప ైఆశలు పెట్టుకున్నారు. ఆయన కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా తనకు చాన్స్ వస్తుందనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి హోం శాఖ తప్ప.. మిగిలిన కీలక శాఖలు ఇచ్చారు. హోంశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు.
సీఎం పదవి కోసం ప్రయత్నించిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కుదరకపోతే హోంశాఖ కోసం పట్టుబట్టినట్లుగాచెబుతున్నారు. అయితే శాఖల విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు అప్పుడు హైకమాండ్ నిరాకరించింది. చివరికి మంత్రి పదవుల జాబితాలో సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చినా.. శాఖల విషయంలో మాత్రం.. జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. పరిపాలన చేయడానికి ఏది బెటర్ అయితే అదే చేయమని సూచించినట్లుగా చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ముందు ముందు అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ క్రమంలో పోలీసు శాఖపై.. పూర్తి పట్టును తన వద్దే ఉంచుకోవాలని.. రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అందుకే… ఇంటలిజెన్స్ చీఫ్ ను ముందుగానే నియమించారు. పాత వారిని పంపించారు. కేసీఆర్ సర్కార్ కు దగ్గర అనుకున్న వారందర్నీ లూప్ లైప్ ను పంపించడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. నేడో రోపే.. పెద్ద ఎత్తున బదిలీలు ఉండనున్నాయని చెబుతున్నారు.