కర్నాటక లోని కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ కు ఇంకా కోపం తగ్గినట్లుగా లేదు. ఏపీ, తెలంగాణలో ఉండే.. కొన్ని ఫేక్ ట్విట్టర్ హ్యాండిళ్లలో ప్రచారం చేసే వారిని పట్టుకుని ఆయన విమర్శలు చేస్తూ… దొరికిపోతున్నారు. గతంలో డీకే శివకుమార్ లెటర్ ను ఫేక్ చేసిన దాన్ని విపరీతంగా ప్రచారం చేసి అబాసుపాలయ్యారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా నడిపే తెలుగు స్క్రైబ్ హ్యాండిల్ అడ్మిన్ కూడా అరెస్టయ్యారు. అయినా కనీసం వెరీఫై చేసుకోకుండా.. ఉత్తరాంధ్ర నౌ అనే ఫేక్ వార్తలు పోస్టు చేసే హ్యాండిల్ లో వచ్చిన పోస్టును పట్టుకుని ఏకంగా సిద్ధరామయ్యపైనే విమర్శలకు దిగారు.
హామీలు ఇచ్చే ముందు లెక్కలేసుకోరా అని తన ట్వీట్లో ఘాటుగా ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం, అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా మాకు ఇవ్వాలనే ఉంది, అయితే డబ్బులు లేవు అని కర్నాటక అసంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నట్లుగా ఆ పోస్టు పెట్టారు. దానికే కేటీఆర్ నేరుగా సిద్దరామయ్యపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ పెట్టారు.
వెంటనే సిద్ధరామయ్య స్పందించారు. ఎందుకు ఓడిపోయారో ఇప్పటికీ ఇర్థం కాలేదా కేటీఆర్ అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు చేసే ఫేక్ వీడియోలను ప్రమోట్ చేసి ఆ పార్టీకి్ బీ టీమ్‌గా పర్ ఫెక్ట్‌గా పని చేస్తున్నారని సెటైర్లు వేశారు. అసలు తాను అసెంబ్లీలో ఏమన్నానో.. తన ప్రసంగం ఏమిటో ఆయన లింగ్ పెట్టారు. కన్నడలో మాట్లాడిన దాని ఇంగ్లిష్ ప్రసంగాన్నీ పోస్ట్ చేశారు. దీంతో కేటీఆర్ పై విమర్శలు పెరుగుతున్నాయి.