మంచి ప్రమోషనల్ కంటెంట్ తో ఒక సినిమా చుట్టూ బజ్ ఏర్పడితే.. ఆటోమేటిక్ గా ఆ సినిమా బడ్జెట్ లెక్కలు పెంచి చెప్పడం గమనిస్తుంటాం. చిన్న సినిమా అయినప్పటికీ ఎక్కడా రాజీపడకుండా చాలా పెద్ద బడ్జెట్ తో సినిమా తీసేశామనే స్టేట్మెంట్లు చూస్తుంటాం. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడటం బావుంది.
తేజ సజ్జాతో హనుమాన్ సినిమా చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఈ పండక్కి రిలీజ్ చేస్తన్నారు. టీజర్ ఆసక్తిని పెంచింది. ఈ రోజు వచ్చిన ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. క్యాలిటీ వర్క్ కనిపించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ చాలా ఓపెన్ గా ఈ సినిమా గురించి మాట్లాడారు.
”హనుమాన్ పెద్ద సినిమా కాదు. ఇది చిన్న సినిమా. చిన్న సినిమాగానే మొదలుపెట్టాం. ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మేకింగ్ పై మరింత ద్రుష్టి పెట్టాం. అలా ని బడ్జెట్ పెంచేయలేదు. మాకు వున్న దాంట్లోనే ఎంత చక్కగా క్యాలిటీగా చేయొచ్చో ప్రయత్నించాం. స్టార్స్, బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా ఏమో కానీ కంటెంట్ పరంగా చాలా పెద్ద సినిమా” అని చెప్పుకొచ్చారు ప్రశాంత్.
ఆలాగే ఈ సినిమా సంక్రాంతికి వస్తోంది. ఇప్పటికే ఆ డేట్స్ కి చాలా పోటీ వుంది. దీనిపై కూడా ఓపెన్ గా తన అభిప్రాయం చెప్పారు. ”చాలా మంది హనుమాన్ సంక్రాంతికి ఎందుకు అని అంటున్నారు. నిజమే.. మాకు స్టార్ ఎట్రాక్షన్ లేదు. థియేటర్స్ దొరకడం కూడా కష్టంగానే వుంది. కానీ మా వంతు ప్రయత్నిస్తున్నాం. మా నమ్మకం హనుమంతుడు. ఆయన పాన్ వరల్డ్ స్టార్. ఆయనకున్న లార్జర్ ఆడియన్స్ ఎవరికీ లేరు. ఆయనే మా బలం” అని చెప్పుకొచ్చాడు.