ఏపీ సీఎం జగన్ రెడ్డి నాకు పేపర్ , టీవీలు లేవని అందరికీ చెబుతూంటారు. అది నిజమని ఎవరైనా నమ్ముతారో లేదో కానీ.. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి పెట్టిన టీవీ చానల్‌కు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇందిరా టెలివిజన్ పేరుతో పెట్టి.. ఆ తర్వాత ఆ కుటుంబంపైనే విషయం చల్లారు. ఇప్పుుడ సొంత బాకా ఊదుకుంటున్నారు. ఈ చానల్ లో పని కీలకంగా పని చేసే వారంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. ఇతర వర్గాలను నమ్మలేకపోతున్న యాజమాన్యం.. ఒక్కొక్కరిగా అందరికీ దారి చూపించింది. నిన్నటి వరకూ సాక్షి టీవీని నేమాని భాస్కర్ అనే బ్రాహ్మణ జర్నలిస్టు చూసుకునేవారు.
ఆయనపై నమ్మకం కోల్పోయారేమో కానీ ఉన్న పళంగా యాదగిరి రెడ్డి అనే తెలంగాణ జర్నలిస్టును ఆయన ప్లేస్ లోకి తెచ్చి.. ఆయనను గెంటేశారు. మూడు నెలలైనా ఉంటుంది కదా అని ప్రజాధనంతో ఓ సలహాదారు పదవి ని మొహాన కొట్టారు. సాక్షి టీవీలో ప్రతి పొజిషన్లో.. నిర్ణయాలు తీసుకునేవారంతా తెలంగాణ రెడ్డి వర్గం వారే. ఒక వేళ రెడ్డి దొరకకపోతే.. తెలంగాణ వారికే చాన్సిస్తున్నారు కానీ.. ఏపీ జర్నలిస్టులను మాత్రం దగ్గరకు రానీయడం లేదు. అలాగే సాక్షి పేపర్లో కూడా.. తెలంగాణ వారే. చివరికి ఏపీ ఎడిషన్ చూసేది కూడా తెలంగాణ జర్నలిస్టులే . కింది స్థాయిలో పులివెందులతో అనుబంధం ఉన్న వారు ఎక్కువగా ఉంటారు. పై స్థాయిలో తెలంగాణ రెడ్లు ఉంటారు. వీరిని మాత్రమే జగన్ అండ్ కో నమ్ముతోంది. ఇంకెవర్నీ నమ్మలేకపోతోంది. సాక్షి యజామాన్యంలో ఉద్యోగులపై అపనమ్మకం రాను రాను పెరిగిపోతోంది. ఎంతో నమ్మకంగా పని చేస్తున్న వారు కూడా తమకు వ్యతిరేకమేమో అని భయపడుతున్నారు.
పైగా పర్మినెంట్ ఉద్యోగుల్ని తీసుకోవడానికి కూడా తంటాలు పడుతున్నారు. ఇటీవల ఎన్నికల పని కోసం.. సీనియర్ జర్నలిస్టుల్ని రిక్రూట్ చేసుకున్నారు.కానీ వారికి మే వరకూ మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఏపీ ఎన్నికలు అప్పటి వరకే. ఆ తర్వాత వారిని భరించలేమని ఇప్పుడే చెబుతున్నారు. అంటే గెలుస్తామన్న నమ్మకాన్ని వారు కూడా కోల్పోయారన్న మాట.