నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరవబోతున్నారు.
సభకు జనం రాకుండా చేసేందుకు అధికార పార్టీ అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు. ఇందుకోసం టీడీపీ 5 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవిగాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు. దీంతో సభను విజయవంతం కాకుండా చేయాలనుకున్న ప్రభుత్వ కుట్ర బెడిసికొట్టింది.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం. పెద్దఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవనున్న నేపథ్యంలో 110 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది. 8 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 100 అడుగల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. వేదికపై సుమారు 600 మంది ఆసీనులవ్వనున్నారు. సభ ఎదురు వీఐపీలు కూర్చుంటారు. సభు వీక్షించేందుకు కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
ఈ నవశకం బహిరంగ సభను అత్యంత భారీగా నిర్వహిస్తున్నాు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం సభా ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత థోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది. విశాఖపట్నం-విజయనగరం మధ్య భారీ కటౌట్లు, జండాలతో పసుపుజాతరను తలపిస్తోంది.