తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ భయంలోనే ఉందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే విశ్లేషించారు. టీడీపీకి భయం అని .. ఆర్కే ఎందుకు అనుకున్నారో మాత్రం చెప్పలేదు. ప్రతీ వారం రాసే వారాంతపు పలుకులో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.కిలారు రాజేష్ ను.. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కొల్లి రఘురాంరెడ్డి బెదిరించారని….దానిపై రచ్చ చేయలేదని ఆర్కే ఆరోపణ. ఆ విషయాన్ని నేరుగా కోర్టుకు అఫిడవిట్ రూపంలో టీడీపీ నేతలు సమర్పించారని కూడా ఆయన చెప్పారు. అయినా ఈ ఒక్క కారణంతో జగన్ రెడ్డి కేసులకు భయపడి టీడీపీ వెనక్కి తగ్గుతోందన్నట్లుగా చెప్పుకొచ్చారు. టీడీపీ ఎక్కడైనా వెనక్కి తగ్గితే ఆ వివరాలతో ఇంకా టీడీపీ భ యపడుతోదని ఇలా చేయాల్సిందని విశ్లేషిస్తే.. నిజమా అి అనుకునేవారు. కానీ టీడీపీకి ఎప్పుడు భయం వీడుతుందో అని నిర్వేదం మాత్రం వ్యక్తం చేశారు.
ఈ విషయం పక్కన పెడితే.. టీడీపీ భయపడుతోంది కానీ జగన్ రెడ్డి మాత్రం నిస్సంకోచంగా డబుల్ రోడ్ రాజకాయీలు చేస్తున్నారని బీజేపీతో సన్నిహితంగా ఉంటూ… కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని ఇద్దర్నీ లైన్ లో పెట్టారని చెప్పుకొచ్చారు. తన తెర వెనుక రాజకీయాలు తాను చేసుకుంటూ పోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ భయపడుతుందని చెప్పినప్పటికీ.. తన ఆర్టికల్ లో మొత్తం జగన్ రెడ్డిపై వివిధ వర్గాల్లో ప్రజల్లో వ్యతిరేకతను పెంచారు. జగన్ రెడ్డికి కన్వర్టడ్ క్రిస్టియన్లు ఓటు బ్యాంక్. తనను తాను దేవుడిగా జగన్ రెడ్డి క్రిస్టియన్ల ముందు ప్రచారం చేయించుకుంటున్నారు. ఇది అందరికీ ఇష్టముండదు. అలాగే .. జగన్ ను ఆ కన్వర్టడ్ ఓటు బ్యాంక్ కే పరిమితం చేసి మిగతా వర్గాల్లో విరక్తి పెంచే వ్యూహాన్ని ఆర్కే తన కథనం ద్వారా అమలు చేశారని అనుకోవచ్చు.
కేసీఆర్ అభ్యర్థుల్ని మార్చక ఓడిపోయారు.. జగన్ రెడ్డి అభ్యర్థుల్ని మార్చి ఓడిపోతున్నారన్న సంకేతాలను ఆర్కే ఇచ్చారు. తాను చెప్పిందే వేదమన్నట్లుగా ఉండాలని జగన్ రెడ్డి అంటున్నారని.. ఇది పార్టీలో సంక్షోభాన్ని తీసుకురాబోతోందని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అదే సమయంలో లోకేష్ అద్భుతమైన నేతగా ఎదిగారని కూడా పరోక్షంగా చెప్పారు. ఓ రకంగా చంద్రబాబును మించిన లీడర్ అయ్యారని కూడా కీర్తించారు. అయితే చంద్రబాబు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయనకు ప్రజామోదం ఉందని నిరూపించలేమని చెప్పుకొచ్చారు.
కారణం ఏదైనా కొత్త పలుకుల్లో ఊహించినంత స్పార్క్ ఉండటం లేదు. ఏపీలో మారిపోతున్న రాజకీయ పరిణామాల్లో ఇన్ సైడ్ అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటినైనా ఆర్కే తన ఆర్టికల్ ద్వారా బయటపెడితే… కొత్తపలుకుకు పాత ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే ఇతర మామలు రాజకీయ విశ్లేషకుల రాతల మాదిరిగానే ఉండిపోతుంది. ఆర్కే నుంచి రీడర్స్ ఇలాంటివి ఆశించరు.