రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్వల్ప వేతనాలతో బతుకులీడుస్తున్న వారు రోడ్డెక్కితే వారిపై విషం చిమ్ముతోంది వైసీపీ. ప్రభుత్వం వచ్చాక వారికి ఏదో దోచి పెట్టామని ప్రచారం చేస్తోంది. వారికి కొద్దిగా సాయం చేయడానికి చేతులురావట్లేదు కానీ వేల కోట్లు పెట్టి వారిపై తప్పుడు ప్రచారం చేయడానికి ప్రకటనలు ఇస్తున్నారు
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పేరిట వాణిజ్య ప్రకటనలు జారీ చేశారు. ఇందులో అన్నీ అబద్దాలే.
జగన్ రెడ్డి అధఇకారంలోకి వచ్చిన 13 జూలై 2019 న జీవో విడుదల చేసింది. అందులో కేవలం వెయ్యి రూపాయల చొప్పున పెంచుతున్నట్లుగా స్పష్టంగా ఉంది. కానీ సాక్షికి ఇచ్చిన ప్రకటనలో వర్కర్ వేతనం రూ.7,000 నుండి అమాంతం రూ.11,500కు తమ సర్కారే పెంచినట్టు చెప్పారు. అంగన్వాడీ వర్కర్ నెలకు రూ.11,500 చొప్పున ఎడాదికి రూ.1,38,000 సంపాదిస్తున్నారని తెల్ల కార్డు రద్దు చేసి సంక్షేమ పథకాలూ 2020లోనే నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. నిజం కళ్ల ముందే ఉంటే.. తప్పుడు ప్రచారాల ద్వారా అందర్నీ నమ్మించాలనుకుంటున్నారు.
ఇప్పుడు రోడ్లపై ఉన్నది అంగన్వాడిలే కాదు..దాదాపు ప్రతి వర్గం ఉంది. వారితో చర్చలు జరిపి వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి… ఈ పేరుతోనూ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేయడం అవినీతి కి పరాకాష్టగా మారింది. ప్రజాధనాన్ని సొంతంగా వాడుకోవడానికి ఏ అవకాశాన్నీ వదలడం లేదు.