ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బాధను తీర్చేవారు కనిపించడం లేదు., గతంలో ఓ సారి టీడీపీ తరపున గెలిచిన ఆయన గత ఎన్నికల్లో ఓడిపోగానే … ఎమ్మెల్యే కేతిరెడ్డి భయంతో బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీలో చేరి ఆయన ఏం సాధించుకున్నారో కానీ.. గత ఏడాది నుంచి తాను టీడీపీలో చేరుతానని రాయబారాలు నడుపుతున్నారు. కానీ ఆయన పార్టీ నుంచి జంప్ కొట్టగానే అక్కడ చంద్రబాబు .. పరిటాల శ్రీరామ్ ను ఇంచార్జ్ గా నియమించారు. దీంతో ఆయన గట్టిగా పని చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఎన్నికలకు దగ్గరకు రావంతో… వరదాపురం సూరి పూర్తిగా బీజేపీని వదిలేశారు. టీడీపీ పేరుతో నియోజకవర్గంలో జెండాలు కట్టుకుంటున్నారు. దీంతో పరిటాల వర్గీయులకు కాలిపోయింది. వారు ఆయన ఫ్లెక్సీలన్నింటినీ తొలగించారు. ఇది వివాదం అయింది. వరదాపురం సూరి మాత్రం టీడీపీ టిక్కెట్ తనకే వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుండి పరిటాల వర్గానికి, వరదాపురం సూరి వర్గానికి పడేది కాదు. అది ఇప్పుడు మరింత పెరిగింది.
అయితే చంద్రబాబు నాయుడు తనకే చివరికి టిక్కెట్ ఇస్తారన్న ఆశతో వరదాపురం సూరి ఉన్నారు. పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వరని నమ్ముతున్నారు. అయితే సూరికి ఇంత వరకూ టీడీపీ వైపు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. సంకేతాలు కూడా రాలేదు. ప్రభుత్వం ఓడిపోగానే.. భయంతో వెళ్లిపోయిన నేతకు.. మ ళ్లీ టిక్కెట్ ఇస్తే.. తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందన్న అభిప్రాయంతో టీడీపీ నేతలు ఉన్నారు. ఆయన ఎందుకు బీజేపీలోకి వెళ్లాలన్న ప్రశ్నలు వస్తున్నాయి.