ఫిబ్రవరి 17వ తేదీన షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియాతో జరగనుంది. ఈ విషయాన్ని షర్మిల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకుంటామన్నారు.
అట్లూరి ప్రియ తో రాజారెడ్డిది ప్రేమ వివాహం, కుల, మతాలకు అతీతంగా పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అమెరికాలో చదువుకుంటున్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడి కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు ఆశీస్సులు అందించారు. షర్మిల ప్రస్తుతం కుమారుడి పెళ్లి హడావుడిలో ఉండటం వల్ల రాజకీయాలను కాస్త పక్కన పెట్టారని చెబుతున్నారు. కుమారుడి పెళ్లి తర్వాతే ఆమె తదుపరి రాజకీయ అడుగులు వేస్తారని చెబుతున్నారు.
అయితే ఎన్నికలు ముంచుకొస్తున్నాయని.. ఆమె కాంగ్రెస్ లో చేరితే… ఏపీలో కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో ఆమెకు స్పష్టత ఉంటే.. కడపలో ఆమె పర్యటనలో .. అనుచరులు హడావుడి చేసే అవకాశం ఉంది.