ఏపీ బీజేపీ కీలక సమావేశం విజయవాడలో జరగనుంది. దీనికి కేంద్రం నుంచి ప్రతినిధిగా తరుణ్ చుగ్ వస్తున్నారు. పొత్తులపై జరుగుతున్న చర్చలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తరుణ్ చుగ్ రాష్ట్ర నేతలకు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. పొత్తులపై బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. టీడీపీతో పొత్తులకు వెళ్లాలని ఒకరు.. వద్దని మరొకరు వాదించుకుంటున్నారు. ఈ మేరకు ఎవరికి వారు నివేదికలు రెడీ చేసుకుని హైకమాండ్ కు సమర్పించుకుంటున్నారు.
బీజేపీది ఒకటే పాలసి. మేము ప్రేమిస్తే… ఎదుటి వాళ్లు ప్రేమించి తీరాల్సిందే. లేకపోతే ఏం జరుగుతుందో దేశవ్యాప్తంగా చూపిస్తూ ఉంటారు. కానీ ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ, వైసీపీ మధ్య గొప్ప ర్యాపో ఉంది. కానీ ఆ పార్టీ పొత్తులు పెట్టుకోదు. ఎలాంటి మద్దతు కావాలన్నా ఇస్తాం..రాష్ట్రం కోసం రూపాయి కూడా అడగబోమని .. ఇబ్బంది పెట్టబోమని చెబుతారు కానీ పొత్తులు మాత్రం వద్దంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తాము ఘోరంగా ఓడిపోతామని వైసీపీ భయం.
అయితే బీజేపీలోని కొంత మంది వైసీపీ కోవర్టులు ఉన్నారు. టీడీపీతో పొత్తులు వద్దని చెబుతూంటారు. అందుకే.. తమతో పొత్తు పెట్టుకుంటే 75 సీట్లు కావాలని డిమాండ్ చేస్తూంటారు. కానీ బీజేపీలో ఎక్కువ మంది నేతలు టీడీపీతో సర్దుబాటు కోరుకుంటున్నారు. గతం కన్నా బీజేపీ పరిస్థితి దిగజారిపోయిందని.. ఎక్కడా డిపాజిట్లు కాదు కదా.. నోటా కూడా దాటే చాన్స్ ఉండదని తేలిపోయింది. అయినా వీరు తగ్గడం లేదు.
పొత్తుల విషయంలో తరుణ్ చుగ్ అందరి అభిప్రాయాలు తీసుకున.ి. హైకమాండ్ ఏమనుకుంటుందో వారికి చెప్పే అవకాశం ఉంది. తరుణ్ చుగ్ గతంలో ఎప్పుడూ ఏపీ వ్యవహారాల విషయంలో … రాలేదు. తెలంగాణకు ఇంచార్జుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనను ఏపీకి పంపడం.. ఏపీ బీజేపీ వర్గాల్లోనూ ఆశ్చర్యంగా మారింది.