తల్లి, చెల్లిని అడ్డగోలుగా గెంటేసి.. కనీసం మంచి , మర్యాదలు కూడా చూసుకోని జగన్ రెడ్డి.. వారికెరైనా సాయం చేస్తామని వెళ్తే బెదిరింపులకు సైతం వెనకాడని జగన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబాలను చీలుస్తున్నారని ఏడ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాకినాడలో పెన్షన్ కాను పేరుతో సభ పెట్టి.. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశంపై ఏడ్చినంత పని చేశారు. నేరుగా షర్మిల పేరు ఎత్త లేక.. రాబోయే రోజుల్లో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు వస్తాయని చెప్పుకొచ్చారు. పొత్తుల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని ఏడుపు మొహంతో వ్యాఖ్యానించారు.
జగన్ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతలు కూడా.. ఉలిక్కి పడ్డారు. తన విజయానికి.. తన పార్టీకి షర్మిల చేసిన సేవలు జగన్ రెడ్డికి గుర్తుండవేమో కానీ ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలతో పాటు తల్లి ఎదుర్కొన్న పరిణామాలు కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు షర్మిల ఏపీలో రాజకీయాలు చేసేందుకు.. కాంగ్రెస్ లో చేరబోతున్న సమయంలో.. తనకు నష్టం జరుగుతుందని క్లారిటీ రావడంతో ఏడుపులు ప్రారంభించారు. కడప నుంచి షర్మిల లోక్ సభకు పోటీ చేస్తారని చెబుతున్నారు. అక్కడ ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని కాంగ్రెస్ హైకమాడ్ హామీ ఇచ్చింది. ఇదంతా తెలియడంతో.. జగన్ రెడ్డిలో వణుకు ప్రారంభమయిందని.. ఏడుపు రాజకీయాలు ప్రారంభించారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. జగన్ రెడ్డి కుటుంబం అనే పదానికి విలువ ఇచ్చి ఉన్నట్లయితే.. సొంత బాబాయిని అడ్డగోలుగా నరికిన వారిని కాపాడేందుకు ప్రయత్నించరని.. అందు కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి వెనుకాడలేదని గుర్తు చేస్తున్నారు.
రాజకీయాల కోసం క్యాన్సర్ తో బాధపడే రామోజీరావు కొడుకు సుమన్ ను సైతం మభ్య పెట్టి సాక్షిలో తప్పుడు రాతలు రాయించి.. అయ్యన్న సహా ఎన్నో కుటుంబాల్లో పదవులు ఆశ పెట్టి పెట్టిన చిచ్చు గురించి.. జగన్ రెడ్డి మర్చిపోయాడేమో కానీ.. ప్రజలు మర్చి పోరన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా జగన్ రెడ్డి షర్మిలపైనా ఏడుగు స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారని కాకినాడ స్పీచ్ తో స్పష్టమయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.