సౌత్ ఆఫ్రికా టూర్ లో వున్న టీంమిండియా మొదటి టెస్ట్ ను ఓడిపోయింది. రెండో టెస్ట్ ఈ రోజు ప్రారంభమైయింది. తొలి రోజు ఆట సంచలనంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన సఫారీ జట్టు 55 పరుగలకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి అద్భుతం అనిపించాడు. బుమ్రా ముకేష్ రెండేసి వికెట్లు తీశారు. టెస్ట్ చరిత్రలో దక్షిణాఫ్రిక అత్యల్ప స్కోర్ ఇదే. అలాగే టీమిండియాపై ఓ ప్రత్యర్ధి జట్టు చేసిన తక్కువ స్కోర్ కూడా ఇదే. ఇంతకుముందు న్యూజిలాండ్ జట్టుని 62 పరుగులకు ఆలౌట్ చేసింది ఇండియా. ఇప్పుడా చెత్త రికార్డ్ సౌత్ ఆఫ్రికా ఖాతాలో పడింది.
55 పరుగలకే సౌత్ ఆఫ్రికా ని కట్టడి చేసి మ్యాచ్ పై పట్టుసాధించిన భారత జట్టు.. బ్యాటింగ్ లో తడబడింది. కేవలం 153 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విరాట్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా బ్యాటర్స్ లో ఏడుగురు డకౌట్లుగా వెనుతిరిగారు. కేవలం రెండు సెషన్స్ లో రెండు ఇన్నింగ్ లు ముగిసిపోవడం సంచలనంగా మారింది. మొత్తానికి ఇండియా 98 పరుగుల ఆధిక్యం సాధించింది. సెకండ్ ఇన్నింగ్ లో సౌత్ ఆఫ్రికాని కట్టడిచేసే తీరుని బట్టి టీం మిండియా విజయావకాశాలు ఆదారపడి వున్నాయి.