బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావును నిలబెట్టాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ గంటా .. తనకు భీమిలీ టిక్కెట్ కావాలని కోరుతున్నారు. అయితే అనూహ్యంగా బొత్స భీమిలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ఖరారు చేయడమే. భార్యను గెలిపించుకునేందుకు … అన్ని స్థానాల్లోనూ తాను చెప్పిన అభ్యర్థులే ఉండాలని.. తాను కూడా భీమిలీ నుంచి పోటీ చేస్తానని బొత్స చెప్పడంతో జగన్ రెడ్డి అంగీకరించారని అంటున్నారు.
ఇప్పుడు గంటా విషయంలో టీడీపీ హైకమాండ్ కూడా ఆలోచించే అవకాశం ఉంది. బొత్స భీమిలీలో పోటీ చేస్తే… ఆయనకు పోటీగా టీడీపీ తరపున గంటానే బరిలోకి దిగుతారు. ఆయన కోరుకున్న టిక్కెట్ వస్తుంది. అలాగే చంద్రబాబు కోరుకున్న పోటీ కూడా జరుగుతుంది. అప్పుడు చీపురుపల్లిలో పని చేసుకుంటున్న కిమిడీ నాగార్జునకే అవకాశం లభిస్తుంది. అయితే గంటా పోటీ చేసే పరిస్థితి ఉంటే.. బొత్స ఆలోచించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.
మొత్తంగా వైసీపీలో టిక్కెట్ల పంచాయతీ నామినేషన్ల వరకూ తేలేలా కనిపించడం లేదు. అటూ ఇటూ మార్పులతో… అభ్యర్థుల్లో ఎక్కడా లేనంత టెన్షన్ ఉంది. చాలా మంది .. ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అని సైలెంట్ అయిపోయారు. ఉంటుందో ఉండదో తెలియని టిక్కెట్ కోసం ఫ్లెక్సీలు కూడా దండగనుకుంటున్నారు.