వరుసగా లేఖలు రాస్తూ.. పవన్ కల్యాణ్ ను కాపు నాయకుడిగా చిత్రీకరించి.. చివరికి కాపులకూ ఆయనను దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా లేఖలు రాస్తూ వస్తున్న చేగొండి హరిరామజోగయ్యకు ప్రతిఫలం లభిస్తోంది. అసలు లేఖలు ఆయన రాస్తున్నారో.. వైసీపీ ఆఫీస్ నుంచి వస్తున్నాయో తెలియదు కానీ.. మంచం దిగలేని స్థితిలో ఉన్న జోగయ్య పేరుతో యాక్టివ్ గా లేఖలు వస్తున్నాయి. తాజాగా ముద్రగడ స్టైల్లో ఓ లేఖ విడుదలయింది. అందులో పవన్ పై చాలా ఆరోపణలు చేశారు. కాసేపటికే ఆయన కుమారుడు వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం బయటకు వచ్చింది.
పాలకొల్లు అసెంబ్లీ నియోజవర్గం వైసీపీ ఇన్చార్జ్గా సూర్యప్రకాశ్‌ను నియమించే అవకాశం ఉందని తాజా సమాచారం.చేగొండి సూర్య ప్రకాష్ జనసేన నేతగా ఆచంట నియోజకవర్గంలో పని చేస్తూ ఉండేవారు. పేరుకు లీడరే కానీ ఎప్పుడూ బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టింది లేదు. అందుకే ఆ సీటును టీడీపీకి కేటాయించారు. దీంతో సూర్యప్రకాష్ మరింతగా అసౌకర్యానికి గురయ్యారు. వైసీపీలో చేరితో.. ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేసుకున్నారు. సరైన అభ్యర్థులు పలు నియోజకవర్గాలకు లేకపోవడతో సూర్యప్రకాష్ కు పాలకొల్లు కేటాయించాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో చిరంజీవి వెంట ఉన్నారు. తర్వాత ఆయన పై విమర్శలు చేశారు. చిరంజీవి పాలకొల్లులో నామినేషన్ వేస్తే తానే గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. అయితే ఆయన ఎలక్షన్ పని చేయకుండా ఇంట్లో ఉండిపోవడంతో చిరంజీవి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి జగన్ ను పొగిడారు. మళ్లీ సైలెంట్ అయ్యారు. జనసేనలో చేరకపోయినా పవన్ కు సలహాలిస్తూ వస్తున్నారు. పవన్ కూడా ఆయనను గౌరవిస్తున్నారు. కానీ ఆ గౌరవాన్ని హరిహామ జోగయ్య.. పవన్ ను చులకన చేయడానికి వాడుకున్నారు. చివరికి కుమారుడికి సీటు తెప్పించుకుంటున్నారు.