వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. కానీ అందులో ఆయన అసహాయత అంతా కనిపించింది. రిజర్వుడు సీట్లలో దళితులపై ..ప్రతాపం చూపిన ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రెడ్డి నేతల జోలికి వెళ్లడానికి జగన్ సాహసించలేకపోయారు. మారుస్తున్నామని ఎన్ని లీకులు ఇచ్చినా చివరికి ఆ పని చేయలేకపోయారు. రిజర్వుడు నియోజకవర్గాల అభ్యర్థులతో మాత్రం బంతాట ఆడుకున్నారు. బదిలీలు చేసిన వారు తమ సొంత నియోజకవర్గాలను కేటాయించాలని ఎంతగా బతిమాలుకున్నా.. కొత్త నియోజకవర్గానేకేటాయించారు.
రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో రిజర్వులు పోను జనరల్ సీట్లలో 80 శాతం రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారు. కమ్మ సామాజికవర్గానికి 9.. కాపులకు 22 సీట్లు కేటాయించారు. చాలా బీసీ వర్గాలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కొన్ని వర్గాల ఓట్లు అవసరం లేదనుకున్నారేమో కానీ.. లైట్ తీసుకున్నారు. పర్సంటేజీ చూపించుకోవడానికి.. ఎమ్మెల్యే, ఎంపీసీట్లని కలిపి ప్రకటించుకుని యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇచ్చామని ప్రకటించుకన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం ఇవ్వాల్సిందే.
ఒక్క అమలాపురం ఎంపీ తప్ప మిగతా అన్ని చోట్ల అభ్యర్థులకను ప్రకటించారు. అమలాపురం ఎంపీ సీటు బీసీకి ఇస్తామని చెప్పారు కానీ పేరు ప్రకటించలేదు. రోజా, అంబటి రాంబాబు సహా అందరికీ సీట్లు లభించాయి. సీట్ల ఆశతో పార్టీలో చేరిన ముద్రగడ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబులకు టిక్కెట్ల లభించలేదు.