కవిత అరెస్టు తప్పు అంతా కేసీఆర్‌దేనని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కొత్త పలుకులో తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేసి ప్రజల్ని కించ పర్చిన ఫలితమే నేడు కేసీఆర్ అనుభవిస్తున్న పరిస్థితులు అన్నారు. తనను.. తన పార్టీని ఎవరు ఏమన్నా.. తెలంగాణను అన్నట్లేనని రాజకీయాలు చేశారని.. ఇవాళ కవితను అరెస్టు చేసి తీసుకెళ్తూంటే ఒక్కరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు. చివరికి గ్రేటర్ మొత్తం సొంత ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరు కూడా కవిత కోసం రాలేదని.. హరీష్,కేటీఆర్ మాత్రమే వచ్చారని ఆర్కే చెబుతున్నారు. అలాగే నిరసనలకు పిలుపునిచ్చినా ప్రజలు కూడా రోడ్ల మీదకు రాలేదు. దీని బట్టి ప్రజల్లో కూడా కేసీఆర్ పై విరక్తి వచ్చేసిందని తేలిపోయిందని ఆర్కే అంటున్నారు.
కవిత అరెస్టు .. అంతకు ముందు పరిణామాలు.. తర్వాత పరిణామాలపై ఆర్కే గట్టిగా విశ్లేషించారు. అయితే కేసీఆర్ కు ఇది ఓ చాన్స్ అని ఆయన చెబుతున్నారు. ఇప్పటికైనా అహంకారం వదిలేసి.. ప్రజల కోసం పని చేస్తే ప్రజలు ఆదరిస్తారని అంటున్నారు. కానీ ఇప్పటికీ అహంకారం కేసీఆర్ ఫ్యామిలీని వదల్లేదని ఆర్కే చెబుతున్నారు. తమను ఓడించి ప్రజలు బాధపడుతున్నారని చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలన పై ప్రజల్లో సంతృప్తి ఉందని తేల్చేశారు. ఇప్పటికైనా పోయిందేమో లేదు.. మారాలని కేసీఆర్‌కు ఆర్కే.. తనదైన శైలిలో ఆర్కే సలహా ఇచ్చారు.
కవిను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్కు లాభమేనని ఆర్కే అంటున్నారు. ఆ ఫలితాలు ఇప్పటికిప్పుడు వస్తాయో లేదో తెలియదు కానీ బీజేపీతో కలిసి లేమని.. అలాగే బీజేపీ కూడా బీఆర్ఎస్తో కలిసి లేమని నిరూపించుకునేందుకు ఈ అరెస్టు ఉపయోగపడుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీ బలం పుంజుకుంటోందని… రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతుందని ఆర్కే అంచనా వేశారు.
మొత్తంగా ఆర్కే .. తాను గత పదేళ్లుగా చెబుతూ వస్తున్నదే నిజమైందని.. అధికారాన్ని నెత్తికెక్కించుకుని చేసిన ప్రతీ తప్పుడు పనికీ ఇప్పుడు కేసీఆర్ శిక్ష అనుభవిస్తున్నారని తేల్చేశారు. ఇది ప్రారంభమేనని ఇంకా చాలా ఉంటాయని.. తట్టుకుని నిలబడితేనే భవిష్యత్ అని హింట్ ఇచ్చారు. మొత్తంగా మారాలని… అహంకారాన్ని తగ్గించుకుని.. ప్రజల్ని గౌరవించడం నేర్చుకుంటే.. ప్రజలు మళ్లీ ఆదరిస్తారని.. తనదైన సలహా పరోక్షంగా ఇచ్చారు. మరి కేసీఆర్ దానికి సిద్ధంగా ఉన్నారో లేదో ?