ప్రధాని మోదీ తమపై ఇంకా ఎంతో కొంత దయ చూపుతారని వైసీపీ నేతలు ఆశ పడుతున్నారు. వారి ఆశలకు కారణం ఎన్నికలు, రాజకీయాలు కాదు.. ఆ విషయంలో మోదీ క్లారిటీ ఇచ్చారు. కేసులు.. ఇతర అంశాల్లోనే మోదీ తమపై జాలి చూపుతారని అనుకుంటున్నారు. అందుకే మోదీ తిట్టలేదని.. తమను తాము సంతృప్తి పరుచుకునేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టడం లేదు.
ఏపీలో పరిస్థితుల్ని అంచన వేసిన బీజేపీ… వైసీపీ మళ్లీ గెలవడం కాదు.. ఘోరంగా ఓడిపోతుందని ఓ అంచనాకు వచ్చింది. అందుకే టీడీపీతో కలిసింది. ప్రధాని మోదీ మొదటి బహిరంగసభకు కూటమి తరపున హాజరయ్యారు. అయితే… వైసీపీ మాత్రం.. మోదీ ఇంకా జగన్ పై అభిమానం చూపుతున్నారని అనుకుంటున్నారు. నిజానికి మోదీ వైసీపీపై ఎప్పుడూ అభిమానం చూపలేదు. వైసీపీ నేతలే అడిగినా అడగకపోయినా మా మద్దతు మీకే అంటూ వెంటపడ్డారు. బీజేపీ ఎప్పుడూ అడగలేదు. మద్దతిచ్చే పార్టీపై వ్యతిరేకత ఎందుకు అన్నట్లుగా కొంత సాఫ్ట్ గా ఉన్నారు.
అయితే సోము వీర్రాజును చీఫ్ గా మార్చిన తరవాత అసలు కథ ప్రారంభమయిది. ఈ విషయం వైసీపీ నేతలకూ తెలుసు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో.. కేంద్రంలో ఎన్డీఏ ఉంటే.. తాము చేసిన నిర్వాకాల దెబ్బకు.. పార్టీ నేతలంతా జైళ్లకు పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జగన్మోహన ్రెడ్డి కేసుల్లో శిక్ష పడుతుంది. కొత్త కేసులు వచ్చి పడతాయి. వీటన్నింటి విషయంలో మోదీ దయ ఉంటే ఎలాగైనా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు. ఈ కారణంతోనే… మోదీ గట్టిగా తిట్టలేదని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అసలు విషయం మాత్రం.. వైసీపీ నేతలకు బాగా తెలుసు.