ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశంలో రాజకీయ సంచలనం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. తెలంగాణ మాజీ సీఎం కుమార్తె అరెస్ట్ అయింది. ఇంకా అనేక మంది అరెస్ట్ అయ్యారు. జైల్లో మగ్గుతున్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అంటే ఏమిటో చాలా మందికి ఇంకా అర్థం కాని వ్యవహారంలానే ఉంది. అసలు స్కామ్ ఎక్కడ జరిగిందంటే ?
ఢిల్లీలో పాత లిక్కర్ పాలసీ ప్రకారం
750ML మద్యం బాటిల్ హోల్ సేల్ ధర ₹166.73
ఎక్సైజ్ పన్ను ₹223.88
వ్యాట్ ₹106.00
రిటైలర్ కమిషన్ ₹33.39
అంటే మొత్తంగా వినియోగదారులకు చేరేసరికి అయ్యే గరిష్ట చిల్లర ధర ₹530.00
ఈ విధానాన్ని మార్చేసి మార్చి 2022లో కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం తెచ్చింది. దానిప్రకారం
750ML మద్యం బాటిల్ హోల్ సేల్ ధర ₹188.41
ఎక్సైజ్ పన్ను ₹1.88
వ్యాట్ ₹1.90
రీటైలర్ మార్జిన్ ₹363.27
అదనపు ఎక్సైజ్ పన్ను ₹4.54
మొత్తంగా వినియోగదారులకు చేరేసరికి అయ్యే ధర MRP ₹560.00
ఈ రెండు విధానాల్లో మార్పుని గమనిస్తే ఒక్క బాటిల్ మీద పాత విధానంలో అయితే ఢిల్లీ ప్రభుత్వానికి ₹329.89 ఆదాయం వచ్చేది. కొత్త విధానంలో అది ₹8.32 మాత్రమే. అంటే ఒక్క బాటిల్ అమ్మకం వల్ల కొత్త విధానంతో ₹321.57 రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది.
పాత విధానంలో రీటైలర్ కమిషన్ ₹33.39 ఉంటే కొత్త విధఆనంలో ₹363.27కి పెరిగింది. అంటే ఒక్క బాటిల్‌కు లాభం ₹330.12 రీటైలర్‌కి లభిస్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయం అంతా రీటైలర్ ఖాతాలో చేరుతుందన్నమాట.
ఇక్కడే అంతా అయిపోలేదు. తయారీ దారే దుకాణాలు పెట్టుకునేలా అవకాశం కల్పించారు. నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదు. కానీ ఇల్లీగల్‌గా అనుమతులుఇచ్చారు.
ఢిల్లీలో సగటున నెలకు 132 లక్షల లీటర్ల మద్యం అమ్మకం జరుగుతుంది. కానీ కొత్త పాలసీలో లక్ష్యాన్ని 245 లక్షల లీటర్ల వరకూ నిర్ణయించుకున్నారు. దీన్ని సాధించడానికి మద్యం తాగేందుకు అవసరమైన చట్టబద్దమైన వయసును పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారు. తెల్లవారు జామున మూడు గంటల వరకూ లిక్కర్ అమ్ముకునే అవకాశం కల్పించారు. డ్రైడేస్ ను 31 నుంచి మూడు రోజులకు తగ్గించారు.
ఇక్కడే ప్రభుత్వ ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే స్కాం జరిగిందని అర్థమవుతుంది.