వాలంటీర్ల ఐదేళ్ల జీవితాన్ని సంకనాకించి చివరి క్షణంలో ఇక ఎందుకూ పనికిరాకుండా.. చివరికి ఆ వాలంటీర్ జాబ్ కూడా లేకుండా చేసేందుకు వైసీపీ నేతలు రెడీ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొనకూడదు కాబట్టి… వారితో రాజీనామానాలు చేయించి… ప్రచారం చేయించుకుంటున్నారు. వారి యాభై ఇళ్ల పరిధిలో వారు అందరికీ పరిచయమే. అధికారంగా వాలంటీర్లుగా కాకపోయినప్పటికీ… ఓటర్లను బెదిరించడానికి ఆ పర్సనాలిటీ సరిపోతుంది. అందుకే వైసీపీ నేతలు వాలంటీర్లతో రాజీనామాలు చేయించి.. ఆ యాభై ఇళ్ల బాధ్యతను ఇస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆ ఐదు వేలను తామే ఇస్తున్నారు.
వాలంటీర్లు సర్వీసులో ఉంటే.. ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం మారినా వారికి ఏదో ఓ దారి చూపించే ప్రయత్నం చేస్తుంది కానీ.. నడి రోడ్డు మీద వదిలేయదు. కానీ రాజీనామా చేసిన వారికి మాత్రం ఎలాంటి అవకాశం లభించదు. వాలంటీర్ల సంక్షేమం కోసం చేపట్టే అ కార్యక్రమంలోనూ వారికి అర్హత ఉండదు. ఇదంతా వైసీపీ నేతలకు తెలియనిది కాదు. అయినా వాలంటీర్ల జీవితాలతో వారికి పని లేదు… వారికి కావాల్సింది ఎన్నికలకు పని చేయించుకోవడం. అదే చేస్తున్నారు.
రాజీనామాలు చేయించుకోకుండా ఎన్నికల ప్రచారం చేయిస్తున్న వారిపై ఇప్పటికే అనేక కేసులు నమోదవుతున్నాయి. వారిని విధుల నుంచి తప్పిస్తున్నారు. అలా బాధితులు అయ్యే వారు కొంత మంది.. రాజీనామాలు చేయించేవారు కొంత మంది.. వైసీపీ కోసం పని చేస్తూ టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యే మరికొంత మంది వాలంటీర్లు ఉన్నారు. ఎలా చూసినా.. కొన్ని ల క్షల మంది యువత భవిష్యత్ ను రాజకీయ స్వార్థం కోసం నాశనం చేసేశారు వైసీపీ నేతలు.