తెలంగాణలో బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న సీటు ఏదంటే అందరూ మెదక్ అంటారు. దీనికి కారణం సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే భారీ మెజార్టీ.. ఇతర చోట్ల కూడా బలంగా ఉన్న పార్టీ. అందుకే ఈ సీటు కోసం చాలా పోటీ ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల కసరత్తు జరిగినప్పుడు కేసీఆర్ చాలా మందికి మెదక్ సీటు హామీ ఇచ్చారు. గజ్వేల్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహా పలువురికి టిక్కెట్ ఆఫర్ ఇచ్చారు. చివరికి కలెక్టర్ గా పని చేస్తూ కుటుంబసభ్యులతో రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన వెంకట్రామిరెడ్డికి సీటు ఇచ్చారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు.
1996లో గ్రూప్-1 సర్వీస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వెంకట్రామిరెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మెప్పు పొందడంలో సిద్ధహస్తుడు. సిద్దిపేట జిల్లా మొదటి కలెక్టర్గా 2016 అక్టోబరు నెలలో బాధ్యతలు స్వీకరించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఎమ్మెల్సీ అయ్యే వరకూ అక్కడే ఉన్నారు. అన్నదమ్ములు రాజపుష్ప సంస్థను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విషయంలో ఈ సంస్థపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి.
ఒక వేల వెంకట్రామిరెడ్డి గెలిచినా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా అంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే.. ఆయన వ్యాపారం రియల్ ఎస్టేట్. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే.. పార్టీ మారిపోక తప్పదు. ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చుకోవడం కంటే పార్టీ మారిపోవడం ఈడీ. ఎందుకంటే వెంటక్రామిరెడ్డి కల్ట్ కేసీఆర్ ఫ్యాన్ కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకే ఆయన ఫ్యాన్ అని గతంలో నిరూపితమయింది.