ఇలా డ్రగ్స్ కేసు బయటపడగానే అలా పురందేశ్వరి కుటుంబ కంపెనీ అంటూ చెలరేగిపోయిన సాక్షి మీడియాకు పురందేశ్వరి గట్టి షాక్ ఇచ్చారు. తప్పుడు కథనాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రూ. ఇరవై కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. స్పందించకపోతే కోర్టుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
సంధ్యా అక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ డ్రగ్స్ ను దిగుమతి చేసుకుంది. ఆ కంపెనీలో పురందేశ్వరి వియ్యంకుడు వాటాదారు అంటూ కథనాలు రాశారు. ఆమె డ్రగ్స్ తెప్పిస్తుందన్నట్లుగా కథలు కథలుగా రాశారు. నిజానికి ఆ కంపెనీలో పురందేశ్వరి వియ్యంకుడు కానీ మరొకరు కానీ.. వాటాదారులు కాదు. మూడు దశాబ్దాల కిందట వ్యాపారం ప్రారంభించినప్పుడు వాటాదారులు కానీ.. చాలా త్వరగా బయటకు వెళ్లిపోయారు ఎవరి కంపెనీలు వాళ్లు నడుపుకుంటున్నారు. కానీ అక్వా ఎక్స్ పోర్ట్స్ లో వాటాదారు అని రాసేసి. పురందేశ్వరిపై బురద చల్లారు.
అంతే కాదు.. డ్రగ్స్ కేసులో తన ప్రమేయాన్ని అంగీకరించారని.. బంధువులు డ్రగ్స్ వ్యాపారం చేయడానికి నైతిక బాధ్యత వహిస్త తన పదవికి రాజీనామా చేసినట్లుగా ఓ ఫేక్ లెటర్ ను కూడా వదిలారు. అంటే పురందేశ్వరిని ఏ స్థాయిలో వైసీపీ నేతలు టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆ లెటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ నిజం వెలికి తీస్తే.. అది ఎక్కడకు చేరుతుందో అందరికీ తెలుసు కాబట్టి పోలీసులు పట్టించుకోరు.