ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ కావడంతో ఎమ్మెల్సీ కవిత ప్రారంభించిన బువ్వకుండ కార్యక్రమాన్ని నిలిపివేశారు. కవిత అరెస్ట్ అయినప్పటికీ 15 రోజులపాటు ఆహారాన్ని అందించి అనూహ్యంగా ఆదివారంతో ఈ ఆహార పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
తన పుట్టినరోజు సందర్బంగా 2018లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కవిత. తర్వాత ఒకటి రెండు చోట్ల ఈ ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. తాజాగా కవిత బువ్వకుండ కార్యక్రమం నిలిచిపోవడానికి ఆర్థిక సమస్యలు కారణమనే వాదనలు పైకి వినిపిస్తున్నా…బువ్వకుండ వంటి సహాయక కార్యక్రమాన్ని నిలుపుదల చేసేంత అధమస్థాయిలో కవిత లేదనేది ఓపెన్ సీక్రెట్. తాను జీవించి ఉన్నంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని గతంలోనే స్పష్టం చేశారు. అయినప్పటికీ సడెన్ గా ఈ కార్యక్రమానికి బ్రేకులు పడటానికి కుటుంబ ఒత్తిళ్లు లేదా ఆమె రాజకీయల నుంచి తప్పుకోవాలనే ఆలోచన కారణమై ఉంటుందనే వాదన నిజామాబాద్ లో గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. దీంతో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తారని తెలుస్తోంది.