వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులకు అండగా నిలవడంతో జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించారు సోదరీమణులు. వారు రోజు రోజుకు తమ డోస్ పెంచుకుంటూ పోతున్నారు. కడప లోక్‌సభలో షర్మిల ప్రజల్ని హంతకుడిగా.. వైఎస్ బిడ్డకా మీ ఓటు అని సూటిగా ప్రశ్నిస్తూ.. వస్తున్నారు. ప్రచారంలో ఈ ఎటాక్ తర్వాత స్థాయికి వెళ్తోంది. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన దళితులు, ముస్లింల ఓట్ బ్యాంక్‌ను కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు షర్మిల వ్యూహాత్మకంగా గురి పెట్టారు.
బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని.. బీజేపీ, వైసీపీ వేర్వేరు కాదని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో దళిత నేతల్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి ఆకర్షిస్తున్నారు. వైసీపీలో టిక్కెట్ దక్కని దళిత నేతల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంతకు ముందే ఆర్థర్, ఎలీజా పార్టీలో చేరగా ఇవాళ పూతలపట్టు ఎమ్మెల్యేను చేర్చుకున్నారు. గుంటూరుకు చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ తీరుతో మోసపోయిన నేతలంతా కాంగ్రెస్ గూటికే చేరుకుంటున్నారు.
మరో వైపు వైఎస్ సునీత కూడా ప్రతి రోజూ ఏదో ఓ టాపిక్ పై మాట్లాడుతున్నారు. షర్మిల ప్రచారం ప్రారంభంలో పాల్గొని.. ఆమె కూడా జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. మూడు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి జగన్ ఓటమే లక్ష్యమన్నారు. శనివారం కూడా జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ప్రెస్‌మీట్ పెట్టి కీలక విషయాలను వెల్లడించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ టి్క్కెట్ ఇవ్వడంతో వీరు ఏ మాత్రం తగ్గకూడదని డిసైడయ్యారు. జగన్ పై చెల్లెళ్ల పోరాటం ఓ రేంజ్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.