హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓవైసీని ఓడించేందుకు బీజేపీ ఈ సారి కొంపెల్ల మాధవీలత అనే నాయకురాల్ని బరిలోకి దింపింది. అభ్యర్థిత్వం ప్రకటించేనాటికి ఈమె నాయకురాలు కాదు. ఏ పార్టీలోనూ లేరు. బీజేపీలోనూ లేరు. కానీ సీటు తెచ్చుకున్నారు. డబ్బు పలుకుబడి మాత్రమే కాకుండా.. మాధవీ లతకు యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటి ఉంది.
బీజేపీ టిక్కెట్ కోసం చాలా మందుగానే ట్రై చేసినట్లుగా టార్గెటెడ్ గా ఇంటర్యూలు ఇస్తూ. .. హిందూత్వంపై విచిత్ర సమాధానాలు ఇస్తూ.. ఆహార్యం కూడా కాస్త భిన్నంగా ఉండేలా చూసుకుంటూ హాట్ టాపిక్ అయ్యారు. బయట ఎవరికీ ఆమె తెలియదు. యూట్యూబ్ వీడియోలతో టైంపాస్ చేసుకునేవారికి తెలుసు. హైదరాబాద్ లో ఎంత మందికి తెలుసనేది డౌటే.
ఓవైసీపీ జాతీయ స్థాయి నాయకుడు. తను తాను ముస్లింల ప్రతినిధిగా ఉంటూ.. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. అలాంటి నేతలపై నిలబెట్టిన మాధవీలతకు పబ్లిసిటీ తెచ్చేందుకు బీజేపీ అనుకూలమీడియా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఓ ఇంటర్యూను మోదీ కూడా ట్వీట్ చేశారు. తాజాగా ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించారు.
కానీ ఆమె సోషల్ మీడియా విన్యాసాలు మాత్రం నవ్వులాటగా మారుతున్నాయి. విమానంలో వాటల్ బాటిల్స్ పంచడం.. ఏ మాత్రం అవగాహన లేనట్లుగా చేస్తున్న వ్యాఖ్యలతో ఈమెనా… ఓవైసీకీ పోటీ ఇచ్చేదన్నట్లుగా సీన్ మారిపోతోంది. గతంలో సీరియస్ హిందూత్వ వాదులకు టిక్కెట్ ఇచ్చేవారు. ఈ సారి సోషల్ మీడియా హిందూత్వ వాదికి ఇచ్చారు. అక్కడే తేడా కొట్టిందన్న సెటైర్లు బీజేపీలోనే వినిపిస్తున్నాయి