తెలుగు రాష్ట్రాల్లో ఎండలతోపాటు చికెన్ ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. గత వారం కిలో చికెన్ రూ. 200 ఉండగా ఇప్పుడు రూ. 300కు చేరుకున్నాయి. పెరిగిన ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.
వేసవి మొదట్లోనే చికెన్ ధరలు కొండెక్కాయి.వారం వ్యవధిలోనే చికెన్ ధరలు ఇలా అమాంతం పెరగడం చూసి చికెన్ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. కిలో చికెన్ ధరతో అర కిలో మటన్ కొనుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.ఎండలు పెరిగే కొద్ది చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ రైతులు స్పష్టం చేస్తున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. గుడ్ల ధరలు తగ్గడమే.
చికెన్ ధరల పెరుగుదలకు.. కోళ్ల లభ్యత తగ్గడమే కారణమని తెలుస్తోంది. శుభకార్యాలు కూడా ఉండటంతో డిమాండ్ కుఇ తగ్గట్టుగా సరఫరా లేకపోవడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు ఓ కారణమని విశ్లేషిస్తున్నారు. ఎండలు ముదురుతుండటంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని దాంతో చికెన్ లభ్యత తగ్గి ధరలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి వేసవి తాపం చికెన్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.