విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ చేస్తున్నారు. అదే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణచైతన్య తెరకెక్కించారు. ఇప్పుడీ టీజర్ బయటికి వచ్చింది.
-ఒక్కసారి లంకలో కత్తికట్టారంటే ఆ మనిషిని సంపకుండా వదలరు
-వాడి సొంత మనుషులే వాడి మీద కత్తికడుతున్నారంట్రా
– వాడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది
-ఇంక వాడిని ఆ అమ్మోరు తల్లే కాపాడాలి.. ఇలా వివిధ పాత్రల వాయిస్ ఓవర్, విజువల్ పోస్టింగ్ తో ప్రజెంట్ చేసిన టీజర్ యాక్షన్ ప్యాక్డ్ గా వుంది.
‘అమ్మోరు పూనేసిందిరా’ అని విశ్వక్ పలికిన డైలాగ్ పవర్ ఫుల్ గా వుంది. టీజర్ లో యాక్షన్ కి పెద్దపీట వేశారు. ముఖ్యంగా కత్తికట్టిన ఎపిసోడ్ సినిమాలో కీలకంగా వున్నట్లు కనిపిస్తోంది. 1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ హింసాత్మక వ్యక్తి కథగా ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. దర్శకుడు కృష్ణ చైతన్య విశ్వక్ ని ప్రజెంట్ చూపించిన తీరు మ్యాసీగా వుంది. మొత్తానికి టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది.