వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అంటే ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు వస్తుంది. ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఎవరికీ కేటాయించరు. గతంలో తిరుపతి ఉపఎన్నికల సమయంలో ఇండిపెండెంట్ కు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సపోర్ట్ చేసింది.
జనసేనపై అనేక రకాల కుట్రలు చేస్తున్న వైసీపీ నేతలు గాజు గ్లాస్ గుర్తుపైనా చేశారు. అయితే కూటమి నేతలు తిప్పి కొట్టారు. ఇతర చోట్ల గాజు గ్లాస్ గుర్తు కేటాయించవద్దని విజ్ఞ ప్తి చేశారు. అన్నీ పరిశీలించిన ఈసీ సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే వైసీపీ చీప్ ట్రిక్కులకు అంతు లేకుండా పోయింది. ఇప్పటికే జాతీయ జనసేన పార్టీ పేరుతో ఓ పార్టీని రంగంలోకి తెచ్చారు. ఆ పార్టీకి పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టారు. బకెట్ గుర్తు ఎంపిక చేసుకుని రంగంలోకి దిగిపోయారు. నాలుగైదు వందల ఓట్లు చీల్చినా చాలనుకుంటున్నారు.
జనసేన పార్టీ గుర్తుపై వైసీపీ నేతలు ఎన్ని సెటైర్లు వేశారో లెక్క లేదు. గాజు గ్లాస్ గుర్తు లేదని .. గుర్తింపు లేదని పేర్ని నాని లాంటి వాళ్లు చెలరేగిపోయేవారు. చివరికి ఇప్పుడు జనసేనకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు ఉంది. గుర్తుల గోల్ మాల్ చేయడం… సిమిలర్ పేర్లు, గుర్తులు ఉన్న వారిని ఎంపిక చేయడం వంటివి విజయాలను ఇస్తాయని చివరి ప్రయత్నంగా ఆశ పెట్టుకున్నారు. కానీ ఇతర పార్టీలు కూడా అదే పద్దతిలో కౌంటర్ ఇస్తాయని మాత్రం ఊహహించలేకపోయారు.