కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన రాసలీలు దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. మీ వీడియోలు ఉన్నాయంటే.. మీ వీడియోలు ఉన్నాయని నేతలు పరస్పరం ఆరోపించుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ జాబితాలోకి హసన్ ఎంపీ, దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ చేరారు. ఆయన బంధువైన ఓ నయస్కురాలితో చేసిన లీలులు వీడియోలుగా బయటకు వచ్చాయి. దాంతో ఆమె తనను వేధించారని కేసు పెట్టింది. దీంతో ప్రజ్వల్ జర్మనీ పారిపోయారు.
ప్రజ్వల్ ఈ సారి కూడా హసన్ నుంచి పోటీ చేస్తున్నారు. హసన్ దేవేగౌడ నియోజకవర్గం. ఆయన వయసు భారం పెరిగిపోవడంతో మనవడికి చాన్సిచ్చారు. పెద్ద కుమారుడు అయిన హెచ్డీ రేవణ్ణ కుమారుడికి హసన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఒక్కరే గెలిచారు. ఈ సారి బీజేపతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లలో పోటీ చేస్తున్నారు. మూడు సీట్లలో ఒకటి హసన్. మోడీ కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. రెండో విడతలో కర్ణాటకలో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
బీజేపీకి ఎలా స్పందించాలో తెలియక కిందా మీదాపడుతోంది. మరో వైపు ఇదే చాన్స్ అనుకుని ప్రజ్వల్ పై లెక్కలేనన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆరోపణలు చేస్తున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం వీటి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమంచింది. రెండో విడతలో మరో పధ్నాలుగు లోక్ సభ నియోజవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిపై ప్రభావం పడితే మొదటికే మోసం వస్తుందని.. బీజేపీ కూటమి కంగారు పడుతోంది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో.. తెలియక దేవేగౌడ ఫ్యామిలీ కిందా మీదాపడుతోంది. డీప్ ఫేక్ అనడానికి కూడాలేనంత క్లియర్ గా దృశ్యాలు ఉన్నాయి. బాధితురాలు కూడా బయటకు వచ్చారు.