తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం , సాయంత్రం అనే తేడా లేకుండా భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మే నెల ప్రారంభమైన మొదటి రోజే భానుడు ఉగ్రరూపం దాల్చాడు.
తెలంగాణలోని పలు జిల్లాలు అధిక వేడితో అల్లాడిపోయాయి. బుధవారం నల్గొండ జిల్లా గూడాపూర్ లో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 18 జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ రెడ్ జోన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచలు చేసింది.
అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి… లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
ORS, ఫ్లూయిడ్స్,కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి.
దూర ప్రాంతాలకు వెళ్ళేవారు వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్ళాలి.
ఎక్కువగా పండ్ల రసాలను తీసుకోవడంతో పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి.
ఎండలో తిరిగేటప్పుడు నల్లటి దుస్తులు వేసుకోవద్దు. తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది.
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దు.
బయటకు వెళ్తే తప్పకుండా క్యాప్ పెట్టుకోవాలని, అలాగే సన్ గ్లాస్ ధరించాలని సూచనలు చేసింది వైద్యా, ఆరోగ్య శాఖ.