మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. సొంత వర్గంలోనే నమ్మకం కోల్పోయి.. పాతబస్తీలో ఎదురీదుతున్నారని ప్రచారం జరుగుతున్న ఓవైసీ ఏపీ రాజకీయాలపై మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు మద్దతిస్తారని అంటున్నారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా పోటీ చేస్తానంటూ వెళ్లే ఓవైసీ తెలంగాణలో పట్టుమని పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేకపోయారు. యాభై స్థానాల్లో పోటీ చేస్తానని సవాల్ చేసి ఊరకుండిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ తప్ప ఎక్కడా పోటీ చేయడంలేదు. కానీ యూపీ లో పోటీ చేస్తారు… బీహార్ లో పోటీ చేస్తారు.. తమిళనాడులో కూడా పోటీ చేస్తారు.. కానీ ఏపీలో పోటీ చేయడానికి మాత్రం ముందుకు రాలేదు.
ఏపీలో ముస్లింలు సమస్యల్లో ఒక్క సారిగా మాట్లాడలేదు ఓవైసీ. కానీ ఎన్నికలు వచ్చే సరికి ఏపీలో జగన్ కు ముస్లింలు మద్దతిస్తారంటూ ప్రకటనలు చేస్తారు. ఆయన తీరు చూసి జగన్ కు ఓటు వేయాలనుకున్న ముస్లింలు కూడా ఈ రాజకీయాల్లో మనం బలైపోవడం మంచిదా… మంచి చేసేవాళ్లకు ఓటేస్తే సరిపోతుంది కదా అన్న భావనకు వస్తున్నారు. స్వంతంగా ప్రచారం చేసినా కూడా కేసీఆర్ కు తెలంగాణ ముస్లింలలో ఓట్లు వేయించలేపోయిన వైసీపీ.. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి జగన్ కు మరింత కీడు చేస్తున్నారు.