షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల నుంచి కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అవినాష్ రెడ్డి, జగన్ పై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు. ఎక్కడా మొహమాటాలు పెట్టుకోవడం లేదు. మనుషు పీకలు కోసే వాళ్లు ఓటేసేది సిగ్గులేని వాళ్లే అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు. వైఎస్ బిడ్డను.. మీ ఎదుటకు వచ్చి కొంగుపట్టి ఓటు అడుగుతూంటే.. అన్యాయం చేయకూడదు అన్న భావన కల్పించే విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.
షర్మిల ప్రచారానికి పోరుమామిళ్ల లాంటి చిన్న పట్టణంలోనే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. స్థానిక వైసీపీ నేతల సహకారం లేకపోతే ఇది సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్, లీడర్ లేరు., అంటే వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా క్రమంగా షర్మిల వైపు మొగ్గు చూపుతున్నారు. వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడం కూడా చర్చనీయాంశం అయింది. బహిరంగంగా నేతలు మాట్లాడుకోకపోవచ్చు కానీ ఈ ఆర్డర్ వల్ల కమాన్ గుసగుస అన్న ట్లుగా ఎక్కువ చర్చ జరుగుతోంది.
సీబీఐ చార్జిషీటులో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని.. పబ్లిక్ డోమైన్ లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవు. అందుకే వాటి గురించి మాట్లాడటం ఆపలేదు షర్మిల, సునీత. ప్రతీ రోజూ తమ దగ్గరున్న ఆధారాలను బయట పెడుతున్నారు. అవినాష్ రెడ్డి జగన్ ఉన్నారని గట్టి ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు. షర్మిల ప్రచారం ఇదే విధంగా మరో వారం రోజులు సాగితే… జగన్మోహన్ రెడ్డి పాపం అని అవినాష్ రెడ్డి మీద జాలిపడే పరిస్థితి వస్తుందన్న సెటైర్లు పడుతున్నాయి. షర్మిల డిపాజిట్ కోల్పోవడం తనను బాధిస్తుందని జగన్ వ్యంగంగా ఇండియా టుడే ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. కానీ తర్వాత ఆయనపైనే సెటైర్లు వేసేలా షర్మిల రాజకీయం నడుస్తోంది.
అవినాష్ రెడ్డిపై కడప పార్లమెంట్ పరిధిలో కనీసం సానుభూతి కూడా లేదన్న అభిప్రాయం ఉంది. భయంతోనే చాలా వరకూ వైసీపీకి ఓట్లేస్తున్నారు. ఈ సారి ఆ భయాన్ని బ్రేక్ చేసే పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడపలో షర్మిల గోల్ రీచ్ అయితే.. వారసత్వం ఆమెకు కట్టబెట్టినట్లే. ఇక సర్దుకోవడమే.