జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేనకు పదిహేను చోట్ల ఖచ్చితమైన విజయం దక్కుతుదని మరో మూడు చోట్ల గట్టి పోటీలో ప్లస్ లో ఉందని కేవలం మూడు స్థానాల్లో మాత్రమే వెనుకబడి ఉందని చెబుతన్నారు.
ఈ సారి జనసేన అధనేత పవన్ కల్యాణ్ తన స్థాయికి తగ్గ విజయాన్ని అందుకోబోతున్నారు. కనీసం యాభై వేల ఓట్ల మెజార్టీ రానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ గెలుపు ఖాయమేనని పోలింగ్ సరళి ద్వారా అంచనా వేస్తున్నారు. కూటమిలో ఓట్ల బదిలీలో ఎలాంటి సమస్యలు ఏర్పడకపోవడం .. మూడు పార్టీల క్యాడర్ పక్కా ప్రణాళికతో వ్యవహారించడంతో స్ట్రైక్ రేట్ 80 శాతం వరకూ ఉండేలా చూసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో పవన్ పోట చేయలేదు. రెండో ఎన్నికల్లో తన బలం తెలుసుకోవడానికైనా సరే ఆయన ఒంటరిగా పోటీ చేయాలని చేశారు. ఇక మూడో సారి మాత్రం ఎలాంటి రిస్క్ చేసుకోలేదు. తన బలాన్ని ఖచ్చితంగా లక్ష్యాన్ని తగిలేలా ఉపయోగించడంలో తనదైన వ్యూహం అవలంభించారు. అనుకున్నట్లుగా పోటీ చేశారు. ఒక్క స్థానం నుంచి ోటీ చేసి దాదాపుగా పద్దెనిమిది స్థానాలతో అసెంబ్లీలో పార్టీకి నాయకుిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.