వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు ఉదయమే ప్రెస్ మీట్ పెట్టి ఈసీ విపలమయిందని వైసీపీ బలంగా ఉన్న చోట మాత్రమే బలగాలను మోహరించారని టీడీపీ బలంగా ఉన్న చోట్ల పోలీసుల్ని పెట్టకుండా ఏకపక్షంగా ఓట్లేసుకునేలా చేశారని ఆరోపించారు. నర్సరావుపేట అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.
చివరికి అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లిలో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తూ మీడియా మందుకు వచ్చారు. ఇతర ప్రాంతాల నేతల్లోనూ ఎక్కడా పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. ఖచ్చితంగా గెలుస్తామని కాన్ఫిడెంట్ గా ప్రెస్ మీట్లు పెట్టలేకపోతున్నారు. ఉభయగోదావరి జిల్లాల వైసీపీ నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. చివరికి ఎస్టీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ట్రెం్స్ అంత గొప్పగా లేకపోవడం వైసీపీనిషాక్ కు గురి చేసిందని అంటున్నారు.
వచ్చే వారం రోజుల్లో… ఇక ఈవీఎంల పని తీరుపైనా ఆరోపణలు చేస్తారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. తాము ఈసీకి వందల ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని.. సజ్జల కూడా చెబుతన్నారు. మొత్తంగా వైసీపీ పెయిడ్ సోషల్ మీడియాలో .. అదీ.. ఇదీ అని ప్రచారం చేయించుకుంటున్నారు కానీ.. క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితి.. వైసీపీ పెద్దలకు కూడా సులువుగానే అర్థమయిందంటున్నారు.