సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. ‘సుచీ లీక్స్’ పేరుతో కోలీవుడ్లో దుమారం రేపారు సింగర్ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన లీక్స్ తమిళ సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపాయి. ధనుష్, త్రిష, ఐశ్వర్య, శింబు, ఆండ్రియా, అనిరుద్, హన్సిక ఇలా టాప్ సెలబ్రెటీల వ్యక్తిగత జీవితంలో రహస్యాలని ట్విట్టర్ వేదికగా ఆమె బయటపెట్టడం కలకం రేపింది. అయితే ఈ లీక్స్ లో వాస్తవం లేదని, ఆధారాలు లేవని, మతి స్థిమితిం కోల్పోయిన సుచిత్ర ఇలాంటి లీక్స్ చేస్తుందని, ఆమెకు పిచ్చిపట్టిందనే ప్రచారం కూడా జరిగింది. ఏమయిందో ఏమిటో కానీ తర్వాత కొంతకాలానికి సుచిత్ర అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ ఈ లీక్స్ కారణంగానే ధనుష్, ఐశ్వర్య విడిపోయారని కూడా కొందరు చెబుతారు.
అయితే ఇంతకాలం అజ్ఞాతంలో వున్న సుచిత్ర మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలనం వాఖ్యలు చేశారు. ధనుష్, జీవీ ప్రకాష్ కుమార్ ని ఉద్దేశించి ఆమె చేసిన ‘గే’ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే ధనుష్, ఐశ్వర్య విడాకులు గురించి ఆమె మాట్లాడుతూ.. ధనుష్, ఐశ్వర్య ఒకరిని ఒకరు దారుణంగా చీట్ చేసుకున్నారు. వారి రిలేషన్ షిప్ లో ఇద్దరూ నిజాయితీగా లేరని సుచిత్ర చెప్పడం కూడా ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మొత్తానికి సుచిత్ర చేసిన ఈ లేటెస్ట్ లీక్స్.. ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో చూడాలి.