రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. హామీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రెండు లక్షలు అదీ ఒకే సారి రుణమాఫీ చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. అందుకు పెద్దగా గడువు కూడా లేదు. గట్టిగా మూడు నెలలు కూడా గడువు లేదు. ఈ లోపే నిధులు సమీకరించుకోవాల్సి ఉంది.
నిధుల విషయంలో రేవంత్ రెడ్డికి ఓ క్లారిటీ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జీతభత్యాలు తప్ప ఖజానా నుంచి ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. జూలై వరకూ ఏదో ఓ ఎన్నికతో కోడ్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అదనపు ఖర్చులు ఏమీ లేనందున ప్రభుత్వ ఖజానాలో రూ. 30వేల కోట్ల మిగులు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సొమ్ములతో రుణమాఫీ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఆగస్టు 15న రుణమాఫఈని ప్రారంభించించి మొదట రూ.2 లక్షలు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేయాలని భావిస్తున్నారు. రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ వైపు నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు. అయితే రుణమాఫీ హామీతోనే మొత్తం స్థానిక ఎన్నికలను కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.