కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి అనుమతి వస్తుందేమోనని ఇంకా వెయిట్ చేస్తోన్న ప్రభుత్వం… అటు వైపు నుంచి ఎలాంటి రిప్లై లేకపోవడంతో ఇరిగేషన్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు రేవంత్.
సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఇరిగేషన్ ఉన్నాతాధికారులతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ ల రిపేర్లపై రేవంత్ చర్చిస్తున్నట్లు సమాచారం. బ్యారేజ్ లలో లోపాలు తలెత్తడంతో వాటి రిపేర్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలా..? నిర్మాణ సంస్థనే భరిస్తుందా..? అన్న దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వర్షాకాలం సమీపిస్తుండటంతో దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ లకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న దానిపై ఈ భేటీలో డిస్కషన్ కొనసాగుతోంది. అదే సమయంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కాళేశ్వరంకు సంబంధించి సమర్పించిన మధ్యంతర నివేదికపై ఉన్నతాధికారులతో రేవంత్ చర్చిస్తున్నారని సమాచారం.
వర్షాకాలం కంటే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు చేపట్టాలని సూచించడంతో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై సమాలోచనలు జరుపుతోంది ప్రభుత్వం.