డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్లో లండన్ పోయేందుకు వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో ఎన్నారై కనిపించారు అంతే జగన్ కు భయం పట్టుకుందో.. ఆయన సెక్యూరిటీకి ముప్పు అనిపించిందో కానీ.. వెంటనే ఆ ఎన్నారైను అదుపులోకి తీసుకున్నారు.
సీఎం సెక్యూరిటీ సిబ్బంది గన్నవరం పోలీసుల్ని పిలిపించి..ఆయనను అప్పగించారు. ఎన్నారై డాక్టర్ ను అరెస్టు చేయడానికి ఇరవై మంది పోలీసుల్ని పిలిపించారు. ఆయనపై తప్పుడు ప్రచారం చేశారు. జగన్ కదలికల్ని వేరే వారికి పంపుతున్నారని.. జగన్ టూర్ ను అడ్డుకోవడానికి వచ్చారని ఇలా నీలి చానళ్లలో ప్రసారం చేశారు. చివరికి పోలీసులు ఆయనను గుట్టుగా వదిలేశారు.
ఈ వ్యవహారం గన్నవరం పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయన అమెరికన్ సిటిజన్. ఊరకనే ఎందుకు అరెస్టు చేశారు.. ఎందుకు వదిలి పెట్టారు.. ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారన్నదానిపై న్యాయపోరాటానికి ఆయన సిద్దమవుతున్నారు. సీఎం సెక్యూరిటీ సిబ్బందితో పాటు గన్నవరం పోలీసులపై ఫిర్యాదు చేస్తాననని అంటున్నారు.
ఉయ్యూరు లోకేష్ కుమార్ జగన్ అవినీతి అక్రమలపై కూడా పోరాడుతున్నారు. తన వద్ద ఉన్న సమచారాన్ని మీడియా చానల్స్ కు కూడా ఇచ్చారు.