సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను కలిసేందుకు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు వచ్చారు. రేవంత్ రెడ్డి వారితో మట్లాడి పంపించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇచ్చామని వారు తెలిపారు.
అయితే బీజేపీలో మాత్రం ఏదో సమ్థింగ్ రాంగ్ అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ముగ్గురూ బీజేపీతో చాలా కాలం అనుబంధం ఉన్న వారు కాదు. బీజేపీ శాసనసభాపక్షం నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందట బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తానని మహేశ్వర్ వరెడ్డి తనతో చెప్పారని కానీ తాను పట్టించుకోలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు కూడా.
రామారావు పటేల్ కూడా కాంగ్రెస్ నేతనే. ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి గెలిచారు. పైడి రాకేష్ రెడ్డి వ్యాపారవేత్తగా పేరు గడించి బీజేపీలో చేరారు. ఆర్మూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వీరు మగ్గురికీ బీజేపీతో అంతంతమాత్రంగానే అనుబంధం ఉండటం.. ప్రత్యేకంగా సీఎం రేవంత్ ను కలవడంతో గుసగుసలు ప్రారంభమయ్యాయి.